Header Ads

రేపటి చంద్రగ్రహణం గురించి , నియమాలు గురించి తెలుసుకోండి

శ్రీ విళంబి నామ సంవత్సరములో వచ్చే చంద్రగ్రహణ గురించి సంపూర్ణ వివరము 2018-2019 తెలుసుకుందాం.

ఎప్పటినుంచి ఎప్పటివరుకు ??


సంపూర్ణ చంద్రగ్రహణము " 27-7-2018 శుక్రవారం రాత్రి గం 11-52 ల నుండి 28-7-2018 శనివారం తెల్లవారుఝామున గం 3-48 నిమిషాల వరకు పట్టును.



వివరము :


విళంబ నామ సం. ఆషాఢ మాస శుద్ధ పౌర్ణిమ - రాత్రి గం1 1-50 వరకు తర్వాత పాడ్యమి. శుక్ర - శనివారముల సంధికాలం, ఉత్తరాషాడ రాగం 12-5 శ్రవణా నక్షత్రముల సంధికాలం నందు - మకరరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణము పట్టును.

మొత్తం గ్రహణ ఆద్యాంతం :: 3 గంటల 56 నిమిషాలు
బింబదర్శన మధ్య కాలం :: 1 గంట 42 నిమిషాలు

నియమాలు :


27-7-2018 వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3-00 గంటల లోపు తిధులు(తద్దినాలు) నిత్య(రోజువారి) భోజనాలు చేసుకోవాలి. గర్భవతులు సాయంత్రం 5-00 గంటల లోపల ఉపాహారం (టిఫిన్) చేయాలి. ఆ తర్వాత తినరాదు - త్రాగరాదు. సాయంత్రం 5 గంటల నుండి మరుసటి రోజు (అనగా శనివార) ఉదయం గం 7-30 నిమిషాల వరకు లోపల గదిలో ఉండాలి. తర్వాత వారి వారి ఇష్టం. తినకుండా ఉండలేనివారు పిల్లలు, వృద్ధులు, అనారోగ్యవంతులు, బాలింతలు రాత్రి 7-00 గంటల లోపు ఉపాహారం (టిఫిన్) చేయాలి,

దోషములు - పరిహారములు :


ఉత్తరాషాడ నక్షత్ర 4వ పాదం, శ్రవణ- ధనిష్ట నక్షత్ర1,2పాదాలు - మకరరాశిలో పుట్టినవారు ఈ గ్రహణం చూడరాదు. 25 రోజులలోపు గ్రహణజపం - శాంతి హోమందారం (చేయాలి) చేయించుకోవాలి.

మిధున - తుల- కుంభ రాశుల వారు 4 నెలల వరకు గతగా ఉండాలి. 9రోజుల లోపల నవగ్రహ పూజ, ఈశ్వరునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. మరుసటి రోజు వసతిని బట్టి ఎవరికివారు గ్రహణ తర్పణాలు (ఆచరించాలి) - చేయాలి.

ముఖ్య గమనిక : 2019 వ సంవత్సరం ఉగాది వరకు ఎటువంటి గ్రహణాలు లేవు.

సమాచారం అందించిన వారు : గుండంపాటి రఘురామశర్మ,

ఈ నెల జులై 27న చంద్రగ్రహణం, ఏ రాశుల వారికి అనుకూలం ప్రతికూలం తెలుసుకోండి


No comments