Header Ads

తర్భూజ తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు

ఈ కాలంలో ఎక్కడ చూసినా తర్భూజ విరివిగా దొరుకుతుంది. దీన్ని తీసుకోవడం శరీరానికెంతో చలవ. ముఖ్యంగా మహిళలకు చాలా విధాలుగా మేలు!

అత్యధికంగా నీటి శాతం ఉన్నవాటిలో తర్భూజ ఒకటి. డీహైడ్రేషన్‌తో బాధపడేవారు వీటిని ఎంతగా తీసుకుంటే అంత మంచిది. కొందరు ప్రయాణ సమయంలో మూత్రవిసర్జన కష్టమని నీళ్లు తాగకుండా ఉంటారు. కానీ ఎండలు మండే సమయంలో అలా చేయడం సరికాదు. అందుకే తర్భూజ ముక్కలు అందుబాటులో పెట్టుకొని అరగంటకి రెండు ముక్కలు తినడం వల్ల శరీరానికి తేమ అందుతుంది. డీహైడ్రేషన్ సమస్యా బాధించదు.

తర్భూజ తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు
తర్భూజ తినడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు



• కొందరికి నెలసరి సమయంలో అధికంగా రక్తస్రావం అవుతుంది. అలాంటి వారు తర్భూజ ఎంత తింటే అంత మంచిది. ఈ పండులో పొటాషియం, సోడియం అధికంగా లభిస్తాయి. ఇవి రక్తస్రావాన్ని అదుపు చేయడంలో కీలక పాత్ర వహిస్తాయి.

గర్భిణులు తీసుకొంటే ఫోలిక్ యాసిడ్, ఇనుము అందుతాయి. ఇవి శిశువు ఆరోగ్యంగా ఎదగడానికి దోహద పడతాయి. బాలింతలు తర్భూజ తినడం వల్ల పాలు వృద్ధి అవుతాయి.

• కెలొరీల శాతం కూడా చాలా తక్కువ. బరువు తగ్గాలనుకొనేవారు ప్రతిరోజూ రాత్రిపూట తీసుకొంటే మంచిది. గుండెకూ మేలు చేస్తుందీ పండు. మధుమేహం ఉన్నవారు తినడం వల్ల రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. గ్లూకోజ్ వృద్ధి పెరుగుతుంది.

ఈ పండులో పీచు శాతం అధికం. మలబద్ధకంతో బాధపడేవారు తర్భూజ తినడం వల్ల సమస్య త్వరగా దూరమవుతుంది. తక్షణ శక్తి కూడా అందుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా అదుపులోకి వస్తాయి. కడుపులో మంట కూడా బాధించదు. ఆకలి మందగించిన చిన్నారులకు తర్భూజ తినిపించడం వల్ల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

• తర్భూజలో పైథో నూట్రియంట్లూ, ఆల్ఫా, బీటా కెరొటిన్లు, ఫొలేట్లు, ఫోలిక్ యాసిడ్లు, పొటాషియం, విటమిన్ సి, ఈ, కె, ఎ అధికంగా లభిస్తాయి. ఇవి చర్మానికీ, కంటిచూపునకూ, జుట్టు ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తాయి.

No comments