టోపి పెట్టుకున్న ముస్లీం యువకుడిని చూసి.. ఆ టోపి ఎందుకని బిడ్డ అడిగిన ప్రశ్నకు తల్లి సమాధానం.!
ఉబర్ పూల్ క్యాబ్ బుక్ చేసుకొని నా జర్నీని స్టార్ట్ చేశాను...కాస్తంత దూరం వెళ్ళాక ఓ తల్లి తన ఆరేళ్ళ కూతురుతో సహా క్యాబ్ లోకి ఎక్కి నా పక్క సీట్లో కూర్చుంది. నా ఫోన్ లో నేను బిజీగా ఉన్నాను.! జర్నీ 1 కిలోమీటర్ సాగాక...అక్కడ ఓ ముస్లీం యువకుడు వారి సాంప్రదాయ దుస్తులు మరియు తలపై టోపితో కార్ లోకి ఎక్కి డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు.!
ఎవరి ఆలోచనల్లో వారున్నామ్...క్యాబ్ లో FM నుండి ఏవో మాటలు, అప్పుడప్పుడు పాటలొస్తున్నాయ్..! తల్లితో కలిసి ప్రయాణం చేస్తున్న పాప.... మమ్మీ..ఆ అన్నయ్య టోపి ఎందుకు పెట్టుకున్నాడు, బయట ఎండ కూడా లేదు కదా.! అని కాసింత పెద్ద గొంతుతోనే అడిగింది.! ఆ మాటలకు క్యాబ్ డ్రైవర్, పక్కనే ఉన్న ముస్లీం కుర్రాడు, నేను ఆ పాప వైపు ఒక్కసారిగా చూశాం.... FM సౌండ్ తగ్గింది.! అందరి అటెన్షన్ పెరిగింది...
అంతలోకే....తల్లి బిడ్డతో...నేను గుడికి వెళ్లేటప్పుడు మరియు అప్పుడప్పుడు మన ఇంటికి పెద్దవాళ్ళెవరైనా వచ్చినప్పుడు వారి కాళ్ళను మొక్కేటప్పుడు కూడా నా తలమీద దుపట్ట వేసుకుంటాను కదా.! అంటే అలా అది పెద్దలకు గౌరవం ఇవ్వడానికి అన్నమాట! అని చెప్పింది. ఆ మాటలువిన్న ఆ పాప...అయితే మరి భయ్యా ఇక్కడ ఎవరికి గౌరవమిస్తున్నారు...మరీ పెద్ద వాళ్లెవ్వరూ ఈ కార్ లో లేరు కదా.? అని రెండో ప్రశ్నను అడిగింది ఆ పాప.?
ఈ సారి మరింత ప్రశాంతంగా ఆ తల్లి సమాధానమిచ్చింది ఇలా ... వాళ్ల తల్లిదండ్రులు అతనికి కలిసిన ప్రతి ఒక్కరినీ గౌరవించి చెప్పారనుకుంటా...నేను నీకు చెబుతాను కదా...ఇంటికి ఎవరొచ్చినా నమస్తే పెట్టమని...అలా అతను కూడా ఆ టోపి ధరించి నమస్కారాలు తెలియజేస్తున్నాడన్నమాట.!
చిన్న వివరణలో ఎంత అర్థం దాగుంది..!? ఇది కదా పిల్లలకు సంస్కారం నేర్పించే విధానం..హ్యాట్సాఫ్ అమ్మా.!
#వారితో కలిసి ఆ జర్నీలో ఉన్న ఓ ప్రయాణికురాలి స్వీయ అనుభవం ఇది.

Post a Comment