Header Ads

అవార్డు ఫంక్షన్ లో రాజమౌళి తన భార్యను ఎంత ప్రేమగా పిలిచారో వైరల్‌ అవుతున్న వీడియో

సినీ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి ‘బాహుబలి’ సినిమా తీయడానికి ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. దాదాపు 5 సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా తీశారు. దానినో దీక్షలా, యజ్ఞంలా పూర్తి చేశారు. దాదాపు ఆయన కుటుంబం మెత్తం ఈ సినిమా లో భాగ్యస్వాములు అయ్యారు . రాజమౌళితో పాటు ఆయన భార్య రమా కూడా ఎంతో శ్రమించారు. కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌, మేకప్‌ తదితర విషయాల్లో ఆమె ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘బాహుబలి’ సినిమాను తెరకెక్కించడానికి రాజమౌళి ఎంత కష్టపడ్డారో.. ఆయన వెన్నంటే ఉండి రమా కూడా అంతే సాయపడ్డారు.ఆయన కుమారుడు కార్తికేయ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు .ఇక ఈ సినిమాకు గానూ రాజమౌళి ఎన్ని అవార్డులు అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు బాహుబలి సినిమా రిలీజ్ అయిన సంవత్సరం నుంచి ఆ సినిమాకి అవార్డుల పంటి పండింది. ఇటీవల తమిళనాడు రాష్ట్రము లో చెన్నై నగరం లో బిహైండ్‌వుడ్స్‌ గోల్డ్‌ మెడల్‌ అవార్డుల్లో రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా బంగారు పతాకం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమౌళికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియోను బిహైండ్‌వుడ్స్‌ సంస్థ తాజాగా విడుదల చేసింది. అదేంటంటే.. రాజమౌళి మెడల్‌ అందుకుంటున్న సందర్భంగా కార్యక్రమాన్ని హోస్ట్‌ చేస్తున్న వ్యాఖ్యాతలు రాజమౌళి గారి సతీమణి రమాను కూడా స్టేజ్‌పైకి ఆహ్వానించారు.

వాళ్లు తమిళ భాషలో స్టేజ్‌పైకి రమ్మని కోరారు. దాంతో రమాకు వాళ్లు ఏమంటున్నారో అర్థంకాలేదు. అప్పుడు రాజమౌళి మైక్‌ అందుకుని ‘చిన్నీ.. స్టేజ్‌పైకి రమ్మంటున్నారు’ అని ప్రేమగా పిలిచారు. అప్పుడు రమ లేచి స్టేజ్‌పైకి వెళుతుండగా అక్కడే ఉన్న అనుష్క.. రమా, రాజమౌళిల ఫొటోలు తీశారు. ఈ అపురూపమైన దృశ్యాన్ని బిహైండ్‌వుడ్స్‌ విడుదల చేసిందనందుకు గానూ ‘జక్కన్న’ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి తాను అడుగు పెట్టిన మొదటి స్టూడియో ఏ వీ ఎం అని మళ్ళీ అదే స్టూడియో లో అవార్డు అందుకోవడం ఆనందం గా ఉంది అని అన్నారు. ఇక చివరిగా రాజమౌళి దంపతులు రాంప్ వాక్ చేసి అలరించారు . మీరు కూడా ఈ వీడియో చూసి ఆనందించండి.No comments