మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ సర్కార్
ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తీర్పు ప్రకారం మల్టీప్లెక్స్‌లు ఇంక సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి కావాల్సిన తినుబండారాలని ఇంటి నుంచి తెచ్చుకోవచ్చు అని తీర్పుఇచ్చింది. ఈ తీర్పు ని తెలంగాణ ప్రభుత్వం స్పూర్తుగా తీసుకుని వాటిని తెలంగాణలో లో కూడా పాటించాలి అనే ఆలోచన లో ఉన్నారు . అయితే ఇక మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లలో.. ఆహార పదార్థాల అమ్మకాల్లో దోపిడీ ఇక చెల్లదని సర్కారు హెచ్చరించింది. అలా అమ్మినవారిపై కఠినచర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. సినిమా హాళ్లలో, మల్టీప్లెక్స్‌ల్లో ఆహారపదార్థాలను, నీళ్లడబ్బాలను బయట ధరల కంటే మూడు, నాలుగు రెట్లు అధిక ధరలకు అమ్ముతున్నారంటూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మల్టీప్లెక్స్‌లు, థియేటర్లలో గరిష్ఠ చిల్లర ధరల (ఎంఆర్పీ) కంటే ఎక్కువ ధరలకు అమ్మినా, ఆయా వస్తువుల పరిమాణం సరిగ్గా లేకపోయినా కఠినంగా వ్యవహరిస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్, తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్‌సబర్వాల్ హెచ్చరించారు. భారీగా జరిమానా కూడా విదిస్తాం అని అన్నారు
ప్రతి వస్తువునూ గరిష్ఠ చిల్లర ధరకే అమ్మాలి , అధిక ధరలకు అమ్మితే జరిమానాల మోతే మొదటిసారి తప్పునకు రూ.25 వేల దాకా జరిమానా రెండోసారి చేస్తే రూ. 50 వేలు జరిమానా, జైలు శిక్ష తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో విధివిధానాలు నిర్దేసిస్తారు. లీగల్ మెట్రాలజీ యాక్ట్, 2009 ప్రకారం మల్టీప్లెక్స్‌ల నిర్వాహకులు ప్రభుత్వం ప్రకటించిన విధివిధానాలను కచ్చితంగా పాటించాలి. సెక్షన్-7 ప్రకారం ప్రతి వస్తువు బరువు, దాని పరిమాణం ప్యాకింగ్‌పై కచ్చితంగా ముద్రించాలి. దీనిని పాటించని వారికి రూ.25 వేల జరిమానా. రెండోసారి అదే తప్పు చేసి దొరికితే ఆరు నెలల జైలు శిక్షతోపాటు జరిమానా. సెక్షన్-18(1) ప్రకారం నాణ్యత సరిగ్గాలేని ప్యాకేజ్ఫుడ్ అమ్మితే రూ.25వేల జరిమానా. రెండోసారి అదే తప్పుచేస్తే రెట్టింపు జరిమానా. కేసు తీవ్రతను బట్టి ఈ జరిమానా లక్ష రూపాయలకు పెరగడంతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు.
విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువు కానీ, సొంతంగా ప్యాక్ చేసిన ఉత్పత్తులుగానీ.. ప్యాకేజింగ్ కమోడిటీ యాక్ట్ ప్రకారం నిబంధనలకు అనుగుణంగా సరైన పరిమాణం లేకపోయినా, తూకంలో తేడా ఉన్నా ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు, పదివేల జరిమానా విధించవచ్చు. నాణ్యత సరిగ్గాలేని ఉత్పత్తులను దిగుమతి చేసుకు న్నా, దాని తూకం, పరిమాణంలో తేడాలు ఉన్నా రూ.50వేల జరిమానా. రెండోసారి అదే తప్పుచేస్తే ఏడాది జైలుశిక్షతోపాటు, రూ.50వేల జరిమానా.
థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్, ఇతర స్నాక్స్‌ను ప్యాకింగ్‌లో కాకుండా విడిగా చిన్న చిన్న కాగితంపాత్రల్లో విక్రయిస్తున్నారు. ఇలాంటి వాటిపై కూడా తప్పనిసరిగా గరిష్ఠ చిల్లర ధర, పరిమాణం ముద్రించాల్సి ఉంటుంది. లేకపోతే కేసులు తప్పవని హెచ్చరించారు. సెప్టెంబరు 1 నుంచి అన్ని సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని అకున్ సబర్వాల్ వెల్లడించారు. క్యాంటీన్లు వెంటనే నిబంధనలను పాటించే విధంగా సర్దుబాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.
సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లోకి బయటి ఫుడ్‌ను తీసుకెళ్లే విషయమై తెలంగాణ ప్రభుత్వం ఇంకా సంపూర్ణ నిర్ణయం తీసుకోలేదని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. బయటి ఫుడ్‌ను మల్టీప్లెక్స్‌లు, థియేటర్లలోకి అనుమతించాలన్నప్రతిపాదన ప్రస్తుతం ఆలోచన దశలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. మల్టీప్లెక్స్‌లు ప్రైవేట్ వ్యక్తులవి కావడంతో బయటి ఫుడ్‌ను వాటి ప్రాంగణాల్లోకి అనుమతించడం లేదని తెలిపారు. సుదీర్గంగా వాటి మీద చర్చ జరిపాకే నిర్ణయం వెల్లడిస్తాం అని అన్నారు .
మల్టీప్లెక్స్‌లు లో బయటి ఫుడ్‌ను అనుమతించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆదేశించిన నేపథ్యంలో ఆ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా సునిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. అక్కడ మంచి ఫలితాలు వస్తే తెలంగాణలోనూ అమలు చేసే అంశంపై అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకైతే థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో స్నాక్స్‌ను ఎమ్మార్పీ ధరలకే అమ్మేలా చూసేందుకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయరాదన్నదే తమ లక్ష్యమన్నారు.

Post a Comment