Header Ads

హెల్మెట్ లేకుండా బండిని నడిపిన ఎమ్మెల్యే , చివరికి ట్రాఫిక్ పోలీసులకు జరిమానా చెల్లించాడు

దేశవ్యాప్తంగా హెల్మెట్ ధరించకుండా ద్విచక్రవాహనం నడిపితే జరిమానా విదిస్తారు అనే సంగతి అందరికి తెలిసిందే . సాధారణంగా ఒక ఎమ్మెల్యే. స్కూటర్ నడపటం చాలా అరుదు. ఎందుకంటే సెక్యూరిటీ కార్ లో అయితే ఎక్కువ ఉంటుంది. ఎవరైనా ప్రత్యర్ధులు దాడి చేసినా తప్పించుకోవచ్చు . కానీ గుజరాత్ కు చెందిన రాకేష్ షా మాత్రం స్కూటర్ తన సతీమణి తో కలిపి నడిపించాడు .




ఈ రాకేష్ షా అహ్మదాబాద్ నగరంలోని ఇల్లీస్ బ్రిడ్జి నియోజకవర్గ ఎమ్మెల్యే , పోయిన ఆదివారం సాయంత్రం మానేక్ బాగ్ బస్టాండు నుంచి నెహ్రూనగర్ కు తన భార్యతో కలిసి ద్విచక్రవాహనంపై హెల్మెట్ ధరించకుండా ఆయన ప్రయాణించారు .

అంతలో హెల్మెట్ ధరించకుండా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన ఎమ్మెల్యే నిర్వాకంపై ఓ యువకుడు ఫోటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. హెల్మెట్ లేకుండా స్కూటరు నడిపిన ఎమ్మెల్యే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే షా సాయంత్రం ఆరుగంటలకు బీఆర్టీఎస్ కారిడార్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసుల వద్దకు వచ్చి హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపినందుకు వందరూపాయల జరిమానాను చెల్లించారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి జరిమానా చెల్లించిన ఎమ్మెల్యే షాను ట్రాఫిక్ ఏసీపీ దీపక్ వ్యాస్ అభినందించారు

తన బంధువు ప్రమాదంలో గాయపడటంతో ఆయన్ను చూసేందుకు ఆసుపత్రికి అత్యవసరంగా ద్విచక్రవాహనంపై హెల్మెట్ లేకుండా వెళ్లానని ఎమ్మెల్యే షా వివరణ ఇచ్చారు.
ఇది మన దేశం లో మొదటి సారి అయ్యివుండొచ్చు ఒక ఎమ్మెల్యే. తన తప్పును తెలుసుకొని ట్రాఫిక్ పోలీసులకు వందరూపాయల జరిమానా చెల్లించటం

No comments