ఊరికోసం నా భర్త హీరోగా మారి ., వీరమరణం పొందాడు- భర్త జ్ఞాపకాల్లో ఓ భార్య
అత్తారింట్లో అడుగుపెట్టిన క్షణంనుండి నా భర్త నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. అత్తామామలు సైతం కన్న కూతురికంటే ఎక్కువగా చూసుకునే వారు. ఏది కావాలంటే అది క్షణాల్లో నా చేతిలో ఉండేది, నేనంటే నా భర్తకు చాలా ఇష్టం..నా కోసం ఏదైనా చేస్తా అనేవారు..చెప్పు ఆకాశంలోని చుక్కల్ని తెంచి తేవాలా? అని అప్పుడప్పుడు నాతో జోక్స్ చేసేవారు.
అంతా సాఫీగా జరిగితే..ఈ రోజు నా అంతరంగాన్ని మీ ముందు ఇలా ఆవిష్కరించేదానిని కాదు.. ఓ కాలరాత్రి నా అందమైన జీవితాన్ని అతలాకుతలం చేసిపడేసింది.! రెండు రోజుల నుండి మా ఊర్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఆ వర్షాలకు మా ఊరి చెరువు గండిపడే ప్రమాదముందని తెలియడంతో.. ఊర్లోని మగాళ్లంతా ఈ సమస్యకు పరిష్కారం కోసం చెరువు దగ్గరకు వెళ్ళారు. అందులో చాలా మంది తమ తమ ఇష్టదైవాల గుడులకు పోయి...ప్రార్థనలు చేస్తున్నారు. మా ఆయన మాత్రం మనం చేస్తే కదా..! దేవుడు సహాయం చేసేది, మనమేం చేయకుండా ఆయన ఏం సహాయం చేస్తాడని....కొంత మంది యువకులను పోగేసి... మెల్లిమెల్లిగా నీటిని వదిలే ప్రయత్నం చేద్దామని చిన్న గండి కొట్టే ప్రయత్నాన్ని స్టార్ట్ చేశాడు... అప్పటికే వరదనీరు విపరీతంగా వచ్చిచేరడంతో....ఒక్కసారిగా చెరువు ఉప్పొంగింది...చెరువు గట్టు మీద ఉన్న మా ఆయనతో సహా అందరూ ఆ వరదలో చెల్లాచెదురుగా కొట్టుకుపోయారు...కానీ మా ఆయన నీటి ప్రవాహంలో పడి..ఓ బండరాయికి బలంగా గుద్దుకోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ ఘటన జరిగి దాదాపు 20 సంవత్సరాలైంది...అయినా ఊరికోసం ఆయన చేసిన త్యాగం ఇంకా నా కళ్ళముందు మొదులుతూనే ఉంది. ఏమండీ....నీకోసం ఏదైనా చేస్తాను అని మాటిచ్చారుగా....ఆకాశంలోని చుక్కలేం ఒద్దు, ఒక్కసారి మీరు కనిపించి వెళ్లండి...మీ రూపాన్ని చూడాలని ఆశగా ఉందండీ....!!

Post a Comment