Header Ads

ఏకాదశి వ్రతం అంటే ఏమిటి , ఎవరు చేయకూడదో , ప్రతిఫలం ఏమిటో తెలుసుకోండి.

ఏకాదశి వ్రతం అంటే కఠినమైనటు వంటి ఉపవాసం, ఈ దీక్ష అందరూ తేలికగా చేయలేరు, మొదటి నియమము, బ్రహ్మచారులు, 80 సంవత్సరాలు దాటిన వ్రుధ్ధులు, గర్భిణీ స్త్రీలు, చేయకూడదు,

అసలు ద్వైత సాంప్రదాయం లో అనగా(శ్రీ మధ్వాచార్యుల ) సాంప్రదాయం లో కఠిన నియమాలు ఎక్కువ, వాళ్లు కనీసం మంచినీరు కూడా తాగకుండా, ఎవరైన ఇంటికి వచ్చిన వారి చేత కూడా నీరు కూడ తాగ నివ్వరు, మరియు ఆరోజన కూడా తద్దినాలు కూడా చేసికోరు, మరుసటి రోజు ద్వాదశి తిథి నాడు చేస్తారు, అసలు భగవంతుని యందు మనస్సు తో చేయవలసినవి సంధ్యావందనం చేయరు, గుడికివెళ్లడం స్వామి దర్శనం చేయరు, విష్ణు సహస్రనామ పారాయణము చదవరు , కానీ ఉపవాసమన్న పేరుతో ఏమీ తినక, తన నిత్యకృత్యం పనులగు ఆఫీసు కు వెళ్తూ, మామూలుగా అన్ని పనులు చేసుకుంటూ, టీవీ ముందు కూర్చొని, రాత్రి పడుకొంటారు అలా చేసే వారిని ఏమన్నారంటే , గత జన్మలో ఎవరికి ఏమి పెట్టినందుకు అది జరిగిన పాపానికి ప్రాయశ్చిత్తం ఇప్పుడు పాపాన్ని పోగొట్టుకోవడమంటారు, కానీ అలా ప్రతిఫలం సిద్ధించదు, కానీ అలా అని కడుపు నిండా తిండి తినేసి గుడికి వెళ్ళి ఆ దైవాన్ని మనస్సు పెడతాను అని చేయడం అసంభవం,


"ఏకాదశి " అంటే  -


మనుష్య నకు కలిగే గాఢనిద్రలో ఇంద్రియములు, మరియు మనస్సు యీ రెండూ సమన్వయం అవుతుంటాయి, "ఇంద్రియములు" అంటే ఏకాదశము , అనగా మనకు 11( పదకుండు) ఇంద్రియములు ఉంటాయి. ఈ పదకుండు ఇంద్రియములు, మనస్సు , యి రెండు అనుసంధానం చేస్తే , జీవుడు పదకుండు వ రంద్రం నుండి బయటకు వెళ్లి పోతాడు, మనిషి జీవితానికి వున్నటువంటి గొప్ప తనం అదే. పదకుండు ఇంద్రియములో పదకుండువ రంధ్రం తెరవగానే జీవుడు అందులోంచి బయట కు వెళ్లి పోతాడు,
అందుకే "రామక్రిష్ణ పరమహంస" గారు అంటారు మనిషి జీవితం రంధ్రన్వేషణే కన్నములు వెతుకుట జీవితానికి ఏ రంధ్రం అన్వేషించాలో అని అన్వేషణ చేసిన వాడే జీవితం తరించిపోతాడు, అక్కర్లేని రంద్ధ్రాన్వేషణచేసిన వాడు నాసనం అయిపోతాడు,

"రంద్ధ్రాన్వేషణ అంటే" :


-మనకి నవరంధ్రాలు (9 రంధ్రాలు) అవి కళ్లు రంధ్రాలు -2, ముక్కు రంధ్రాలు- 2 , చెవి రంధ్రాలు -2, మలద్వార రంధ్రం , మరియు మూత్రద్వార రంధ్రం అనే తొమ్మిది రంధ్రాలు, మరియు అమ్మ రంధ్రం నుండి బయటకు వచ్చే టప్పుడు మూసుకుని ఉండే రంధ్రం దశమ రంధ్రం దీన్నే నాభి రంధ్రం అంటారు, ఈ రంధ్రం ద్వారా తన బిడ్డ కు ఆహారం పంపబడుతుంది మరల ఎప్పుడైతే బిడ్డ బయటకు వస్తాడో తల్లి నాభి రంధ్రం ముసుకొనబడితుంది యిదే నాభి దశమ రంధ్రం , పదకుండువ రంధ్రం, తెరిచుకోవలసిన రంధ్రం పదకుండు వ రంధ్రం దారి వెతుకుతారు దాన్నే ఏకాదశి వ్రతం మని అంటారు, పదకుండు వ రంధ్రం తెరుచుకోవడానికి మూత తీయడం రావాలి, ఆ మత తీయడం రావాలి ఆ మూత తీయడం వచ్చిందనుకోండీ జీవుడు ఇక వేరే శరీరం నకు రాడు ,ఆసారి ఎప్పుడు వెళ్లాడో అదే ఆఖరి సారి వెళ్లి పోవడం, ఈ పదకుండువ రంధ్రం ఎక్కడ వుంటుందంటే శిరస్సు పై న అదే సహస్రారము అత్యంత పవిత్రమైనది దీన్ని ఎవరి చేతి తో తాక రాదు , దానిపై కొట్టడం గానిచేయరాదు దీనినే బ్రహ్మ రంధ్రం అంటారు , మహా తేజస్సుతో వుంటుంది
ఈ రంధ్రం పైన గురువులు వారి చేతులు తో శిష్యులు పై ఉంచి ఆశ్వీర్వచనం చేసేటప్పడు తాకచ్చు, మరల తల్లిదండ్రులు, కొన్ని సందర్భాల్లో చిన్నవారైన భార్య కూడా తాక వచ్చు ఎందువల్లనంటే అభ్భ్యంజనస్నానం చేసేటప్పుడు భార్య నూనె తీసుకుని మాడు రంధ్రం పై మర్దనం చేయవచ్చు దాని వల్ల అలక్మీ పోతూ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది,
ఈ పదకుండు వ రంధ్రం ను గురించి అన్వేషణ చేస్తూ అది తెరువు మార్గం కోసం , అంటే ఉపాస మార్గం నందు ఆ రంధ్రం దగ్గర కు ఎలా వెళ్లాలో జీవుడు తెలుసు కుంటాడు,

అందుకే వివేకానందుడు తన పంచాంగ పుస్తకం లో , ఓ తిధి దగ్గర ఎర్రని సిరా తో ఒక గీతను గీసుకుంటాడు , ఆగీత ఎందుకు గీసారో అక్కడ ఉన్న శిష్యులకు అర్థం కాలేదు, ఆ తిధి రోజు ఇన్ని గడియలకు , ఇన్ని క్షణాల్లో తన బ్రహ్మ రంధ్రం తెరుచుకుని రక్తం చిట్లుతూ, శరీరం పడి పోయీ, ఊర్థవముఖంగా జీవుడు బయటకు వెళ్లగలిగాడు.

అంతటి విసిష్టిత కలుగుతుంది
ఏకాదశి వ్రతం మంటే.

No comments