Header Ads

శ్రిరెడ్డి కి ధీటైన సవాలు విసిరిన లారెన్స్ , లైవ్ ప్రెస్ మీట్ లో కలవాలని డిమాండ్ చేస్తూ లేఖ

శ్రీ రెడ్డి తమిళనాడు కి వెళ్లి అక్కడ న్యూస్ చానెల్స్ మరియు డిజిటల్ మీడియా లో ఇంటర్వ్యూ ఇచ్చారు . ఈ ఇంటర్వ్యూలలో చాలా మంది తనని వాడుకున్నారు అని , తనకి సినిమాలో ఛాన్స్ ఇస్తా అని చెప్పి , ఇవ్వకుండా మోసం చేశారు అని చెప్పింది . ఇలా మోసం చేసినవారిలో లారెన్స్ కూడా ఉన్నారు అని , రెబెల్ సినిమా సమయం లో ఛాన్స్ ఇస్తా అని చెప్పి వాడుకుని మళ్ళి అసలు సినిమాలో కూడా పెట్టుకోలేదు అని చెప్పింది.




దీనిపై చాలా సార్లు మీడియా వాళ్ళు లారెన్స్ ని అడిగారు . ఎట్టకేలకు ఆయన మీడియా వారికి సమాధానం చెప్పారు .

ఆయన ఏమన్నారు అంటే



  1. ఇలాంటి చిల్లర పనులు చాలా మంది చేస్తుంటారు అని , కానీ తన పేరు లాగడం బాధవేసింది అని అన్నారు .

  2. శ్రీ రెడ్డి ఇప్పటివరకు తనని కలవలేదు అని .

  3. శ్రీ రెడ్డి చెప్పడం ప్రకారం రెబెల్ సినిమా అప్పుడు నేను ఆమెను కలిసాను అని ఆమె అంటుంది . మరి నేను మోసం చేసి ఉంటే , ఇప్పటికి 7 సంవత్సరాలు అయ్యింది రెబెల్ సినిమా నేను తీసి . ఇప్పటివరకు ఎందుకు మీడియా కి గాని ఫిలిం ఛాంబర్ కు గాని కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు .

  4. తాను నా హోటల్ రూమ్ కి వచ్చింది అని అక్కడ రాఘవేంద్రస్వామి విగ్రహాలు , రుద్రాక్షలు వున్నాయి అని తాను చెబుతుంది . నేను ఎప్పుడు హోటల్ లో దేవుని బొమ్మలు రుద్రాక్షలు పెట్టాను . ఇది నేను ఎప్పుడు నుంచో పాటించేది. దేవుని విగ్రహాలు హోటల్ లో పెట్టె బుద్ధి నాది కాదు .

  5. నేను ధైర్యంగా చెప్పగలను నేను ఏ తప్పు చేయలేదు అని , ఆ దేవునికి కూడా తెలుసు .

  6. నువ్వు ఇన్ని అబద్హాలు ఆడిన నీ మీద నాకు కోపం లేదు , జాలి వేస్తుంది నువ్వు చెప్పే అబద్ధాలు చూసి.

  7. నీ సమస్య ఏంటి , నీకు ఛాన్స్ ఇస్తా సినిమాలో అని చెప్పి అందరూ వాడుకున్నారు అని అంటున్నావు . ఇవన్నీ పక్కనపెట్టి నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తా ప్రెస్ మీట్ లో అందరి ముందు .

  8. నేను పెట్టె ప్రెస్ మీట్ లో నువ్వు నీ లాయర్ ని కూడా తీసుకుని రా . ఒక సారి విషయం తేలిపోతుంది .

  9. అందరి ముందు నీకు చిన్న డైలాగులు మరియు చిన్న డాన్స్ స్టెప్లు ఇస్తా , నువ్వు మంచిగా చేస్తే నేనే నీకు సినిమా లో అవకాశం తప్పని సరిగా ఇస్తా . నువ్వు ఒక వేళా చేయలేకపోతే లీగల్ గా వెళ్లి కోర్ట్ లో తేల్చుకుందాం

  10. నేను నిన్ను ఎదరుకోవడానికి ఎటువంటి భయం లేదు

  11. ఈ మొత్తం నేను అందరికి తెలియచేయడానికి కారణం ఆమెకు బయపడి కాదు , కేవలం స్త్రీ కి నేను ఎప్పుడు గౌరవం ఇవ్వడం అనే ఒక కారణం చేత , నాకు స్త్రీ మీద గౌరవం వుంది కాబట్టే మా అమ్మకి గుడి కట్టగలిగాను .

  12. దయచేసి మంచి మాట్లాదాం ,మంచి చేద్దాం.

నీ జీవితం కూడా బాగుండాలి అని కోరుకుంటున్న " అని లారెన్స్ చెప్పారు

No comments