Header Ads

మీ ATM పిన్ మర్చిపోయారా ? నిమిషంలో ఇలా తెలుసుకోండి

సాధారణంగా ATM పిన్ మర్చిపోతే కార్డు బ్లాక్ చేయడం లేదా కొత్త కార్డుకి అప్లై చేయడం లాంటివి చేస్తారు. కాని ఇప్పుడున్న టెక్నాలజీకి అలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరమే లేదు. బ్యాంకుకు వెళ్ళే అవసరమా అంతకన్నా లేదు. కేవలం నిమిషంలో మీ పిన్ తెలుసుకోవచ్చు.



పిన్ తెలుసుకోడానికి మీకు కావలసినవి :::

1. ATM కార్డ్
2. బ్యాంక్ ఎకౌంట్ నెంబర్
3. మీ బ్యాంక్ ఎకౌంట్ కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్.

ఈ మూడు మీ దెగ్గరే ఉంటే ఇక మీ ఎ.టీ.ఏం పిన్ మీరు ఒక వేల మర్చిపోయినా తెలుసుకోవచ్చు. ఇక మీరు చేయాల్సింది ఇవే . మీ దగ్గరలోని మీ బ్యాంక్ ATM సెంటర్ లోకి వెళ్ళి మీ కార్డును పెట్టండి. దయచేసి గుర్తువుంచుకోండి మీ బ్యాంకు కి చెందిన ఎ.టీ.ఏం సెంటర్ కు మాత్రమే వెళ్ళాలి.

ATM సెంటర్ లోకి వెళ్ళిన తరువాత, మీ కార్డు ని ATM మెషిన్ లో పెట్టి ఈ కింద విధంగా చేయండి

1Banking (బ్యాంకింగ్) అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి.
2. Pin Generate ( పిన్ జేనరాట్) లేదా ఏటియం పిన్ రిసెట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి.
3. మీ Account Number ( ఖాతా నెంబర్ ) ని ఎంటర్ చేయండి.
4. మీ మీ బ్యాంక్ ఎకౌంట్ కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి
5. మీ ఫోన్ కి OTP (One Time Password ) వస్తుంది.
6. OTP ని ఎంటర్ చేసి మీ పిన్ నెంబర్ ని మార్చితే సరిపోతుంది,

ఇక మీ పాత పిన్ తొలగిపోయి కొత్త పిన్ ఆక్టివేట్ అవుతుంది.

ఈ విషయాన్ని మీ బంధుమిత్రులతో షేర్ చేసి అవగాహన కలిపించండి

No comments