6 ఏళ్ళ క్రితం....ఓ కుర్రాడితో వెళ్ళిపోయిన కూతురు గురించి తండ్రి మాటలు.!!
6 ఏళ్ళ క్రితం నా కూతురు ఓ కుర్రాడితో లేచిపోయింది. ఆ కుర్రాడు ఒక్క నెలకే నా కూతుర్ని వదిలేశాడు..3 నెలలు గాలించిన తర్వాత నా కూతురు ముంబాయ్ సమీపంలోని ఓ స్లమ్ ఏరియాలో కనిపించింది. అప్పటికే తను 3 నెలల గర్భిణీ.! వెంటనే ఇంటికి తీసుకురాకుండా నేను కూడా నా కూతురితో అదే ఇంట్లో ఉన్నాను....అప్పటికే మానసింకంగా కుంగిపోయిన నా బిడ్డ ప్రతి రోజు రాత్రి లేచి ఎవరో తలుపు కొడుతున్నారు తీయండి...తీయండి...అని అరిసేది.! అలా అరిచిన ప్రతిసారీ నేను డోర్ ఓపెన్ చేసి ఎవ్వరూ లేరని చూపించి...ఆమెను సముదాయించి పడుకోబెట్టేవాడిని....( ప్రేమించినోడు వస్తాడనే నమ్మకం తనది.)
సంవత్సరం గడిచింది...ఆమె మానసిక స్థితి అలాగే ఉంది, ఇప్పుడు తనకో బిడ్డ....కానీ ఆ బిడ్డను ఎవ్వరికీ ఇవ్వదు కారణం తన బిడ్డ కూడా తనకు దూరమౌతుందేమోననే భయం తనది.! కొన్ని రోజులు గడిచాక..ఓ వ్యక్తి నా బిడ్డను చేసుకుంటానని ముందుకొచ్చాడు అతనికి పెళ్ళై అతని భార్య చనిపోయింది...ఊరోళ్ళ మాటలు విని ...అతని దగ్గర నేను నా కూతురి గురించిన విషయం దాచాను... కానీ ఏదో తప్పు చేస్తున్నాననే ఫీలింగ్ నన్ను వేధించింది..వెంటనే అతన్ని పిలిచి....విషయం చెప్పడానికి ప్రయత్నించాను, కానీ వెంటనే అతను నాకు తెలుసు ..మీ కూతురే చెప్పింది. నిద్రలో లేచి డోర్ తీయమనే అలవాటు తో పాటు తన గతం గురించి అంతా చెప్పింది ..అంతే తప్ప ఐయామ్ ఆల్ రైట్ అని కూడా చెప్పింది.! దీంతో నేను షాక్ అయ్యాను.!
ఇప్పుడు..... నా కూతురికి పెళ్ళై ఏడాదైంది.! నా కూతురి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. కొత్త అల్లుడు నా బిడ్డను నా కంటే బాగా చూసుకుంటున్నాడు.. నేనైతే డోర్ తెరిచి చూపించే వాడిని...అతను మాత్రం డోర్ తీసి...బయటకు తిప్పి ఎవ్వరూ లేరు, ఎవ్వరూ రారని అర్థమయ్యేటట్టు వివరించేవాడు...క్రమంగా నా కూతురు అర్థరాత్రి నిద్రలేచి డోర్ తీయండి అనే మాటనే మర్చిపోయింది.! వారి అన్యోన్యతకు ఇప్పుడు ఓ కొడుకు.
#తెలిసీతెలియని వయస్సులో ప్రేమ..పెళ్ళి అనే తొందరపడే వారందరికీ కనువిప్పు ఈ ఉదంతం...అందరికీ తనలాగ రెండో ఛాన్స్ రాకపోవొచ్చు.

Post a Comment