పులస చేప వచ్చేసింది , ఒక కిలో 5 వేలు పలుకుతున్నా కొంటున్న చేప ప్రియులు
గోదావరి జిల్లాల మాంసాహార ప్రియులు పులస పేరు చెబితే లొట్టలేసేస్తారు. అందుకే "పుస్తెలమ్మి అయినా పులస తినాలి" ఉభయ గోదావరి జిల్లాల్లో పులస చేపలంటే ఎంత మక్కువో చెప్పకనే చెప్పే సామెతిది.. గోదావరి వరద నీరు బంగాళాఖాతంలోకి పారుతున్న వేళ పాయల్లోకి వచ్చే ఈ సీజనల్ చేప ధర చాలా ఎక్కువ. పాయల్లోకి ఈదుతూ వచ్చే పులస చేపలను పట్టుకునే మత్స్యకారులు, వాటికి ఉన్న డిమాండ్ మేరకు మంచి ధరకు అమ్మి డబ్బు చేసుకుంటూ వుంటారు. ఎర్రటి వరద నీటిలో గుడ్లు పెట్టడానికి ఈ పులస చేపలు ఈదుతూ ఎదురు వస్తుంటాయి. ఈ సీజన్ లో మాత్రమే, అది కూడా గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వరకూ పులసలు లభిస్తాయి.
ఇక ఈ సీజన్ లో కిలో పులస చేపల ధర రూ. 5 వేల వరకూ పలుకుతుండగా, ఖర్చుకు వెనుకాడకుండా మత్స్య ప్రియులు కొనుగోలు చేస్తున్నారు. ఈ చేపలను చెరువుల్లో పెంచడానికి వీలుండదు. ఒడిశా తీరంలోనూ ఇవి లభ్యమవుతున్నా, గోదావరి జిల్లాల్లో లభించే చేపలకే రుచి అధికమని భోజన ప్రియులు చెబుతుంటారు. సముద్రం నుంచి గోదావరిలోకి వచ్చే ఇలస చేప, రెండు రోజుల పాటు ఎదురు ఈదితే పులసగా మారుతుంది. ప్రస్తుతం అంతర్వేది మార్కెట్, సిద్ధాంతం, నరసాపురం, రావులపాలెం తదితర ప్రాంతాల్లోని మార్కెట్లలో ఇవి లభ్యమవుతుండగా, వాటిని కొనుగోలు చేస్తున్న స్థానికులు, దూర ప్రాంతాల్లోని తమ వారికి పంపుతున్నారు.
ఈ పులస చేప లో చాల పౌషకాలు ఉంటడం , మరియు కేవలం రెండు నెలలు మాత్రమే దొరకడం , కేవలం గోదావరి తీరంలో దొరకడం వల్ల చాలా ధర ఎక్కువ

పులస చేప గురించి చాలా మందికి తెలియని విషయాలు :
- ఈ పులస చేప వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది.
- ఈ చేప చాలా రుచికరంగా ఉంటుంది.
- చనిపోయినా అనంతరం రెండు రోజులు అయినా చేప తాజాగా ఉంటుంది.
- ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని 'వలస చేప' అంటారు.
- కేవలం జులై, ఆగస్టు మాసాల్లో లబిస్తుంది ఈ అరుదైన చేప
- గోదావరి నదిలో దొరికే పులస చేప రుచి మిగతా చేపలకన్న రుచికన్న ఉంటుంది. గోదావరి తీపి నీటితో పులస రంగు రుచి మారిపోతుంది.
- పిల్ల చేపల నుంచి పెద్ద చేపల వరకూ ఇవి వేరు వేరు సైజుల్లో దొరుకుతాయి ఆయా సైజులను బట్టి రూ.500 నుంచి రూ.5 వేల వరకూ ధర పలుకుతాయి. అది డిమాండును బట్టి మూడు వేల నుంచి 5 వేల వరకూ ధర ఫలుకుతోంది.
- ఈ పులసచేపల్లో ఆడ (శన), మగ (గొడ్డు) అని రెండురకాలుంటాయి. ఇందులో ఆడచేప రుచి ఎక్కువగా ఉండడంవల్ల ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది.
- ఈ చేపకు ముళ్ళు చాలా ఎక్కువగా వుంటాయి.
ఈ పులస చేప లో చాల పౌషకాలు ఉంటడం , మరియు కేవలం రెండు నెలలు మాత్రమే దొరకడం , కేవలం గోదావరి తీరంలో దొరకడం వల్ల చాలా ధర ఎక్కువ
Post a Comment