Header Ads

తండ్రి చిత్తుకాగితాలు పోగుచేసి రోజు 50 రూపాయిలు సంపాదిస్తాడు , తన కొడుకు మొదటి ప్రయత్నం లోనే అల్ఇండియా 141 ర్యాంక్ సాధించాడు

20 ఏళ్ళ ఆశారాం చౌదరి అనే విద్యార్ధి విజయగంజ్ మండి అనే చిన్నగ్రామము లో నివసిస్తున్నాడు. ఆ విజయగంజ్ మండి అనే పల్లె నుంచి ఆ జిల్లా ప్రధాన కార్యాలయం 40 కిలోమీటర్ల దూరం. ఈ విద్యార్ధి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పరీక్షలో అల్ ఇండియా 707 ర్యాంక్ సాధించాడు , మరియు తన (ఓ.బి.సి) శ్రేణి లో 141 వ ర్యాంక్ సాధించాడు . ఇతను నేషనల్ ఎలిజిబిలిటీ మరియు ఎంట్రన్స్ పరీక్షా కూడా రాసి అల్ ఇండియా 2,763 ర్యాంక్ సాధించాడు, తన (ఓ.బి.సి) శ్రేణి లో 803 ర్యాంక్ సాధించాడు




ఆశారాం చౌదరి తల్లితండ్రుల పేర్లు రంజిత్ మరియు మమతా చౌదరి , వీళ్ళు విజయగంజ్ మండి అనే చిన్నగ్రామము లో చాలా సంవత్సరాలు నుండి ఉంటున్నారు. వీరు ఒక చిన్న గుడిసెలో జీవిస్తున్నారు . ఇంటి పైకప్పునా ప్లాస్టిక్ కవర్ మరియు మట్టితో తాయారు చేసిన పలకతో కప్పిబడివుంది. వాన పడినా , గాలి గెట్టిగా వీచిన ఇంట్లో నివసించడం చాలా కష్టం . వీరు నివసించే ఇంట్లో కి వర్షపు నీరు రావడం సర్వసాధారణం అని ఆసారాం చెప్తున్నారు .

ఇన్ని అడ్డంకులు ఉన్నా కూడా తనకి చదువు మీద ఉన్న శ్రద్ధ ఏ మాత్రం తగ్గలేదు .ఇతను నవోదయ విద్యాలయం లో చదివాడు , తనకు జీవశాస్త్రం.నేర్పిన అమిత్ అనే మాస్టర్ గారికి రుణపడి వుంటాను అని తన వల్లే ఈ రోజు ఇలా రాంక్ సాదించగలిగాను అని ఆసారాం చెప్పారు .
తన తండ్రి పాత న్యూస్ పేపర్లు అన్ని అందరి దేగ్గర వేరుకుని వచ్చి అవి అమ్మిన డబ్బుతో వచ్చే దానితో ఇల్లు నడిపించేవాడు అని , ఒక రోజు డాక్టర్ దెగ్గరికి వెళ్తే 5 నిమిషాల్లో 50 రూపాయిలు తీసుకుని , ఏ మందులు ఎప్పుడు వాడాలో రాసాడు అని అది చూసి తాను కూడా డాక్టర్ అయ్యి తన తండ్రి కష్టాలు తీర్చాలి అని అనుకున్నా అని ఆసారాం అంటున్నారు. తన తండ్రి రోజు రైల్వే ట్రాక్ దెగ్గర కూడా పేపర్లు తీసుకొచ్చినా కూడా 50 రూపాయిలు సంపాదించడం చాల కష్టం అని చెప్పాడు ఆసారాం.

కసపడితే ఏదైనా సాధ్యం అని నిరూపించిన ఆసారాం కు హ్యాట్స్ ఆఫ్

No comments