Header Ads

అవినీతి చేసింది అని దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలికి 30 సంవత్సరాల జైలు శిక్ష

దక్షిణ కొరియా ప్రభుత్వ నిధుల దుర్వినియోగం చేశారు అని , 2016 ఎన్నికల్లో పార్లమెంట్‌ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలపై దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్‌ జ్యుయన్‌హైకు దోషిగా నిర్థారిస్తూ శుక్రవారం దక్షిణ కొరియా లోని సియోల్‌ స్థానిక కోర్టు 30 సంవత్సరాల జైలు శిక్షను విధించింది.




అలాగే  నేషనల్‌ ఇంటెలిజన్స్‌ సర్వీస్‌ కోసం సుమారు 30 బిలియను ప్రభుత్వ నిధులను, తన సహాయకులతో కొల్లగొట్టారన్న మరో అవినీతి కేసులో పార్క్‌కు 24 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసింది. తాజాగా, పార్క్‌కు సియోల్‌ సెంట్రల్‌ డిస్ట్రిక్‌ కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. మొత్తం కలిపి ౩౦ సంవత్సరాలు పైగా తనకు శిక్ష కరారు చేసారు . పార్లమెంటరీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికలో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణపై కూడా పార్క్‌ను దోషిగా గుర్తించింది.

ఇది ఇలా ఉంటే తన పై ఇంకొన్ని ఆరోపణలు చేసారు ,విచ్చలవిడిగా లంచం , అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజానాలో నుండి డబ్బులు తన సొంత ఖర్చులకు , విలాసవంతమైన జీవితం తను చేశారు అని న్యాయవాదులు తెలిపారు.

ఈ విషయం మీద జడ్జి మాట్లాడుతూ , దేశం ముందుకు వెళ్ళాలి మరియు తరువాత కాబోయే అధ్యక్షులకు ఇది ఒక గుణపాఠం అవ్వాలి అని , ఇంకా ఇప్పటినుంచి తప్పు ఎవరుచేయాలన్న ఆలోచన కూడా రాకూడదు అనే ఉద్దేశం తో ఇంత కఠినంగా శిక్షితున్నాం అని చెప్పారు .

ఇది ఇలా ఉంటే దక్షిణ కొరియా లో ఏ శిక్ష అయినా అందరికి తెలిసేలా టీవీ లో ప్రత్యక్ష ప్రసారం అవ్వాలి అని పోయిన సంవత్సరం నిర్ణయించారు . దీనితో శిక్ష వివరాలు తెలుసుకోవడానికి కూడా దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్‌ జ్యుయన్‌ మరియు ఆమె తరుపు న్యాయవాదులు కూడా కోర్ట్ కి రాలేదు. అంతా టీవీ లోనే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వారి శిక్ష తెలుసుకున్నారు .

తప్పు చేస్తే ఎంతటివారినైన శిక్షిస్తాం అని నిరూపించిన దక్షిణ కొరియా దేశానికి హ్యాట్స్ ఆఫ్ .బహుసా ఒక మాజీ  అధ్యక్షురాలు కి ఇంత కఠినమైన శిక్ష విధించడం ఇదే మొదటిసారి అనుకుంట .

No comments