Header Ads

ఈ నెల జులై 27న చంద్రగ్రహణం, ఏ రాశుల వారికి అనుకూలం ప్రతికూలం తెలుసుకోండి

ఈ శతాబ్దిలోనే సుదీర్ఘమైన చంద్ర గ్రహణం శుక్రవారం ఏర్పడనుంది. అసలు చంద్రగ్రహణం అంటే ఏంటో ముందు తెలుసుకుందాం . చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్ర గ్రహణం అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది. చంద్ర గ్రహణం చాలాసేపు అంటే కొన్ని గంటలు మొత్తం అర్థగోళం అంతా కనిపిస్తుంది. జులై 27 రాత్రి నుంచి జులై 28 వేకువజాము వరకు ఈ గ్రహణం కొనసాగనుంది. ఈ చంద్ర గ్రహణాన్ని భారత్‌లోనూ వీక్షించే వీలుంది. ఆ సమయంలో చంద్రుడు అరుణ వర్ణంలో కనువిందు చేయనున్నాడు.



భారతదేశం లో ఎప్పటినుంచి ఎప్పటివరుకు ??


భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల 44 నిమిషాలకు గ్రహణం ప్రారంభం అవుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.

ఎంతసేపు ??


సుమారు 103 నిమిషాలపాటు అంటే సుమారుగా 2 గంటలు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. శనివారం వేకువ జామున 3.49 గంటల వరకు గ్రహణం కొనసాగుతుంది. 4.58 గంటలకు గ్రహణ ప్రభావం పూర్తిగా తొలుగుతుంది.

ఈ సారి చంద్ర గ్రహణం విశిష్టత ఏంటి ??


ఈ చంద్ర గ్రహణానికి మరో విశిష్టత ఉంది. ఆ రోజు అంగారక గ్రహం భూమికి అత్యంత చేరువగా రానుంది. 2003 తర్వాత ఇంత దగ్గరగా వస్తుండటం ఇదే తొలిసారి. గ్రహణం రోజున అంగారకుణ్ని వీక్షించే వీలుంది. చంద్ర గ్రహణాన్ని నేరుగా చూసినా ఇబ్బందేం ఉండదు.

ఎవరు ఎవరు చూడకూడదు ??


గర్భిణులు, కంటి సంబంధిత వ్యాధులు ఉన్నవారు గ్రహణాన్ని వీక్షించకపోవడం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు రాత్రి 7.30 గంటల్లోగా భోజనం ముగించడం మంచిది. త్వరగా జీర్ణం కావడానికి టిఫిన్ చేయడం ఉత్తమం.

ఎ రాశి వారికి ఏంటి ప్రయోజనం ??


ఇది ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల్లో వస్తోన్న కేతుగ్రస్త చంద్ర గ్రహణం. గ్రహణం ముగిశాక స్నానం చేసి పూజాధికాలు, దానధర్మాలు చేయడం అందరికీ శుభం కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి.

మేషం, సింహం, వృశ్చికం, మీన రాశులు :


వీరికి ఈ గ్రహణ ప్రభావం అనుకూలంగా ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ధనయోగం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరు గ్రహణ సమయంలో ఇష్టదైవాన్ని స్మరించాలి.

మేష రాశి ::


వీరు జాగ్రత్తగా ఉండటం మంచిది.

ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలకు చెందిన వారు ::


గ్రహణానికి నాలుగు గంటల ముందే భోజనం చేయాలి. గ్రహణం విడిచిన తర్వాత స్నానం ఆచరించాలి. దీపారాధన చేసి భగవంతుణ్ని స్మరించాలి.

మకర రాశి ::


ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగో పాదం, శ్రవణ, ధనిష్ఠ 1,2 పాదాలు, రాశిలో జన్మించిన వారు ఈ గ్రహణాన్ని వీక్షించకపోవడం ఉత్తమం. 41 రోజుల్లోపు గ్రహణ జపం, శాంతి హోమం, దానం చేయించుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.

మిథున, తుల, కుంభ రాశులు ::


వీరు ఆరు నెలలపాటు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం వీడిన 11 రోజుల్లోగా నవగ్రహ పూజ, శివుడికి అభిషేకం చేయించుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు.

No comments