Header Ads

పని చేయటానికి ఉద్యోగం లేదు అని రోడ్లపై తన రెజ్యూమ్‌ పంపిణీ , 200 పైగా కంపెనీల నుంచి ఆఫర్లు వెల్లువ

అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలోని సిలికాన్ వ్యాలీలో ఉద్యోగం దొరకలేదని నిరాశచెందిన ఒక వెబ్‌డెవలపర్ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. అతని పేరు డేవిడ్ , ఈ నిర్ణయమే అతని జీవితాన్ని మార్చివేసింది. అతను రోడ్లపై నిలుచుని తన రెజ్యూమ్‌లను పంచడం ప్రారంభించాడు. పైగా జనం తనను తక్కువగా చూడకూడదనే ఉద్దేశంతో ఒక ప్లకార్డును కూడా ప్రదర్శించాడు. దానిపై ‘ఇల్లులేదు, విజయం దక్కలేదు. దయచేసి రెజ్యూమ్ తీసుకోండి’ అని రాసివుంది.




అదే దారిలో కారులో వెళ్తున్న ఒక మహిళ , అతనిని చూసింది , అతని తో మాట్లాడి , అతని రెజ్యూమ్‌ తీసుకుని , ఆ రెజ్యూమ్‌తో పాటు ఆ యువకుని ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిని సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న అని కూడా చెప్పింది అతనికి . ఆమె ఈ విషయాన్నీ తన ట్విట్టర్ లో షేర్ చేసింది . దీంతో ఇది వైరల్‌గా మారింది. తరువాత గూగుల్, నెట్‌క్లిక్స్, లింక్డ్‌ఇన్‌తోపాటు ఏకంగా 200 కంపెనీలు అతనికి ఉద్యోగం ఇస్తాయని ముందుకు వచ్చాయి. వివరాల్లోకి వెళితే ఉద్యోగవేటలో ఉన్న డేవిడ్ కసారెజ్ దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. ఇంటికి వెళ్లాలని కూడా అతనికి అనిపించలేదు. ఓటమిని ఒప్పుకోలేకపోయాడు. దీంతో సిలికాన్ వ్యాలీలో వీధుల్లో తిరుగుతూ తన రెజ్యూమ్ ఇవ్వసాగాడు. అతన్ని జాస్మిన్ స్కాఫీల్డ్ అనే మహిళ చూసింది. అతని వ్యథను ట్విట్టర్‌లో షేర్ చేసింది. దీంతో అతనికి వరుస అవకాశాలు వస్తున్నాయి. కాగా డేవిడ్... టెక్సాస్ యూనివర్శిటీలో మేనేజ్‌మెంట్ డిగ్రీ చేశాడు. 2014 నుంచి 2017 వరకూ జనరల్ మోటార్స్‌లో పనిచేశాడు. ఏదో కారణంతో అతనిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. దీంతో అతను ఉద్యోగ వేటలో పడ్డాడు.

ఎట్టకేలకు తనకు ఉద్యోగం, నిరాస చెందకుండా తన ప్రయత్నం చేసినందుకు ఈ రోజు తనకి ఉద్యోగం వచ్చింది .

No comments