Header Ads

ఈ 16 ఏళ్ల ఎయిడ్స్ బాధితురాలి మాటలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి

హెచ్ఐవీ ఎయిడ్స్ అనే పేరు పలకడానికే చాలా మంది భయపడుతుంటారు. అయితే ఇది అంటు వ్యాధి కాదు. కేవలం అసురక్షితమైన లైంగిక పద్ధతుల వల్లే ఎయిడ్స్ వస్తుంది అనే విషయంపై అవగాహన లేక చాలా మంది వారిని దూరం పెడుతుంటారు. దీనిపై అవగాహన కలిగించే ఉద్దేశంతో వినూత్నకార్యక్రమం చేపట్టింది యూనిసెఫ్. ఎయిడ్స్ బాధితులను ముట్టుకున్నా వాళ్లతో ఉన్నా ఎలాంటి ప్రమాదం లేదనే విషయాన్ని ప్రచారం చేయడమే లక్ష్యంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఉజ్జెకిస్థాన్‌కు అనే దేశానికి చెందిన 16 ఏళ్ల అజీమా హెచ్ఐవీ ఎయిడ్స్ బాధితురాలు. ఆమె ఓ ప్రతి రోజు కూడలిలో నిల్చుని . "నేను హెఐవీ బాధితురాలిని. నన్ను కౌగిలించుకోండి" అని రాసున్న ప్లకార్డు పట్టుకుని ఆమె రోజు ఉంటుంది. ఈమె చేసే కార్యక్రామానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. చాలా మంది ఆ అమ్మాయిని హగ్ చేసుకుని తమ అప్యాయతను పంచుతున్నారు. వాళ్లలో చిన్నారులు, వృద్ధులతో సహా అన్ని వయసుల వాళ్లూ ఉన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య సందేశం "ఎయిడ్స్ బాధితులకు దగ్గరగా ఉండటం , ప్రమాదకరం కాదు. ఈ విషయాన్ని ప్రచారం చేయడమే నా లక్ష్యం. అసురక్షిత లైంగిక పద్ధతుల వల్లే ఎయిడ్స్ వస్తుంది. మాట్లాడితే, పలకరిస్తే, స్నేహం చేయడం ద్వారా , భోజనం చేయడం వల్ల ఎయిడ్స్ రాదు. నన్ను కౌగిలించుకున్న ప్రతి ఒక్కరిలో నా తల్లిని, అమ్మమ్మను, చెల్లిని, తమ్ముడిని చూశాను. వాళ్ల ఆప్యాయతను మర్చిపోలేను " అంటూ ఉద్వేగంగా మాట్లాడింది అజీమా. దీన్నంతా షూట్ చేసి ఓ డాక్యుమెంటరీగా మలిచింది యూనిసెఫ్. ఈ వీడియోకి సోషల్ మీడియాలోనూ విశేష స్పందన ఇప్పుడు వస్తోంది మీరు కూడా ఈ వీడియో చూడండి.
అయితే మనం కూడా అసలు ఎయిడ్స్ గురించి సంపూరణంగా తెలుసుకుందాం


ఎయిడ్స్ అంటే ఏమిటి  ??


ఎయిడ్స్ అంటే “ఎక్వయిర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్'. ఎక్వయిర్డ్ అనగా మనం దాని బారిన పడగలం , ఇమ్యూన్ డిఫిషియన్సీ అనగా వ్యాధినిరోధక వ్యవస్థ క్షీణించటం. సిండ్రోమ్ అనగా కొన్ని వ్యాధి లక్షణాల యొక్క సమాహారం. ఎయిడ్స్ అనేది HIV అనే ఒక వైరస్ వల్ల వస్తుంది. దీనినే హ్యుమన్ ఇమ్యునో డిఫిషియన్సీ వైరస్ అని అంటారు. మీరు HIV బారిన పడితే మీ శరీరం ఆ ఇన్ ఫెక్షన్ ఎదుర్కొవటానికి కొన్ని Antibodies తయారు చేస్తుంది. HIV రక్త పరీక్ష చేసినప్పుడు రక్తంలో ఈ విధమైన Antibodies ఉన్నాయో లేదో చూస్తుంది. ఈ రకమైన Antibodies గనుక పరీక్షతో ఉన్నట్లు తేలితే అప్పుడు అతనిలో/ ఆమెలో HIV ఉన్నట్లు లెక్క మరియు ఆ వ్యక్తిని పాజిటివ్ అని అంటారు. HIV పాజిటివ్ అయినా లేక HIV బారిన పడినా అది ఎయిడ్స్తో సమానం కాదు. చాలా మంది HIVతో చాలా ఆరోగ్యంగా చాలా సంవత్సరాలుగా జీవిస్తున్నారు. HIV ప్రవేశించిన కొన్ని సంవత్సరాల తరువా ఆ వైరస్ మన రోగనిరోధక వ్యవస్థను క్షీణింపచేస్తుంది. తద్వారా, ఇతర వైరస్లు, పారాసైటిల్, ఫంగై, బ్యాక్టీరియా మన శరీరం మీద దాడి చేస్తాయి. వీటినే అవకాశవాద వ్చాధులు అంటాం. ఈ పరిస్థితులలో సరైన మందులు గనుక వాడకపోతే రక్తంతో ఉండే CD4 కణాలు తగ్గిపోతాయి. ఈదశలో CD4 కణాలు 200/million center కన్నాతగ్గిపోతే అప్పుడు ఆ దశని AIDSదశ అని అంటాము.

ఎయిడ్ ఎట్లా వస్తుంది ??


1, ఎయిడ్స్ అనేది తొలి దశలో ఎవరికీ రాదు. మొదటగా HIV బారిన పడితే తరువాత జరిగే పరిణామమే ఎయిడ్స్ ఎవరైనా HIV బారిన పడితే వారి రూపురేఖలు, ఆరోగ్యస్థితిలో సంబంధం లేకుండా వారు H.L.V. పరీక్ష చేయించుకోక పోయినా సరే వారి నుంచి HIV సోకే ప్రమాదం ఉంది. H.T.V సోకిన వ్యక్తి యొక్క రక్తం యోని స్రావాలు, వీర్యం, చనుబాలు, మొదటి వాటిలో ఉండే వైరస్ శాతం ఇతరులకు HIV బారిన పడటానికి దోహదం చేస్తుంది. చాలామందికి వైరస్ ఈ విధంగా వ్యాపిస్తుంది. ఎటువంటి రక్షణ లేకుండా HIV తో జీవిస్తున్న వారితో లైంగిక సంపర్కం జరిగినప్పుడు. , HIV సోకిన వ్యక్తి వాడిన సూదులు, సిరంజిలు ఇతరులు వాడినప్పుడు. HIV తల్లి తన బిడ్డకి జన్మనిచ్చినప్పుడు లేక తరువాత తల్లిపాలు పడుతున్నప్పుడు. ఇది వరకు ప్రజలకు HIV అనేది కలుషితమైన రక్తం ఎక్కించినప్పుడు సంక్రమించేది కానీ ఇప్పుడు రక్త పరీక్షలు ప్రతిస్థాయిలోని క్షుణ్ణంగా జరిగి, HIV కలుషిత రక్తాన్ని నివారించగలుగుతున్నాము. ఉమ్ము, కంటినీరు, చెమట వల్ల HIV వస్తుంది అని ఇప్పటివరకు ఎక్కడా కూడా నిరూపితం కాలేదు కానీ, H.L.Vఉన్నవారితోOral Sex చేసినప్పుడు, రక్తం వచ్చేలా ముద్దు పెట్టుకున్నప్పుడు నోటిలో అల్సర్, పుండ్లు వంటివి ఉన్నప్పుడు HIVవచ్చే అవకాశం ఉంది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వారి 2006 అంచనాల ప్రకారం 2.47 million వుందికి HIVతో నివశిస్తున్నారు. అందులో 4% పిల్లలు, 8 % వుంది 49 సంవత్సరాల పైబడి, మగిలిన 88% 15-49 సవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు. ఈ వైరస్ యొక్క తీవ్రత ఈ క్రిందివిధంగా ఉంది.

IDUS - 8.7%

MSMS - 5.7%

FSWS - 54%

Truckers - 24%

General Population- 3.0%

నేను H.I.V పాజిటివ్ అయితే నాకు ఏమౌతుంది ??


నీకు HIV ఉంది అని సరిగ్గా తెలియకపోవచ్చు. కొంతమందికి జ్వరం, తలనొప్పి, కీళ్ళనొప్పులు, కడుపునొప్పి, కండరాలు వాయటం, ఎలర్జీ, చర్మవ్యాధులు వంటివి కొన్ని రోజులలో గానీ లేక వారంలో గానీ రావచ్చును. చాలామంది వీటిని మామూలు ఫ్లూ జ్వరంలాగానే చూస్తారు. కానీ కొంతమందిలో పైన పేర్కొన్న ఎటువంటి చర్యలు జరగవు. వ్యాధి నిరోధక వ్యవస్థ ఈ వైరసని గుర్తించి పోరాడే లోపుగా ఇది కొన్ని వారాలు, నెలలలో రెట్టింపు సంఖ్యలై పెరుగుతుంది.
ఈ సంయంలో రక్త పరీక్షలో HIV పాజిటివ్ అని రాదు, మరియు ఈ వైరస్ వేరే వ్యక్తిని HI.Vపాజిటివ్చేయడానికి దోహదపడుతుంది. మీ యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ వైరసని గుర్తించి దానిని ఎదుర్కోవడానికి H.L.V antibodies తయారు చేసుకుంటుంది. ఈ antibodies తయారైనవడే మనం స్థితిని గుర్తించగలం. మొట్టమొదటిసారిగా Flu జ్వరం రూపంలో బయటపడినవై రన్ HIV లక్షణాలు కొంతమందిలో దాదాపుగా 10 సంవత్సారాలుగా వారు ఆరోగ్యంగా కూడా ఉన్నా, ఈ వైరస్ వారి వ్యాధినిరోధక వ్యవస్థను నెమ్మదిగా దెబ్బతీస్తూ ఉంటుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని తెలుసుకోవాలంటే మనలో ఉన్న CD4 కణాలను లెక్కకట్టాలి. వీటినే T-సహాయక కణాలు అని కూడా అంటారు. ఆరోగ్యంగా ఉన్న వారిలో రక్తంలో ఈ కణాలు 500-1500/milli litreకి ఉంటాయి. సరైన వైద్యం చేయించుకోకపోతే CD4 కణాలు తగ్గిపోయి దాని వల్ల జ్వరం, రాత్రి చెమట పట్టటం, అతిసారం, మll లక్షణాలు కనబడతాయి. మీకు HIV ఉన్నట్లైతే ఈ ఇబ్బందులు రోజులు, వారాలు తరబడి తగ్గకుండా ఉంటాయి. నాకు ఎయిడ్స్ ఉందని తెలుసుకోవడటల ఎలా?
మీ రోగనిరోధక వ్యవస్థ క్షీణిస్తే మీరు HIV న 0 0 చి ఎయిడ్స్ కు వెళ్ళే ప్రమాదం ఉంది. మీకు 200 కన్నా CD4 కణాలు /మైక్రో లీటరుకు తగ్గినట్లైతే లేక మీ CD4 శాతం 14% కన్నా తక్కువ ఉంటే మీకు ఎయిడ్స్ పరిధిలోకి వస్తారని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ వారు పేర్కొని ఈ క్రింది ఇవ్వబడిన అవకాశవాద వ్యాధులను ప్రచురించినారు. I, PCP (Pneumocystis Pneumonia) ఒక మూత్రపిండాల వ్ఛాధి. ) చర్మ క్యాన్సర్, CMV (Cytomegalovirus) కళ్ళకు చెందిన వ్యాధి , Candida- ఫంగస్ ఇన్ ఫెక్షన్ గొంతులో, యోనిలో వచ్చు వ్యా ధి.

ఎయిడ్స్ వల్ల కలుగు తీవ్ర పరిణామాలు ఇవే :


నెలలో 10% కన్నా ఎక్కువ బరువు కోల్పోవటం, మెదడు వాపు వ్యాధి మరియు ఇతర ఆరోగ్య సంబంధిత కారణాల వల్ల మనిషి చనిపోవును. ఎయిడ్స్ అనేది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొంతమంది HIV బాదితులు కొన్ని నెలలకు చనిపోతే మరికొంతమంది కొన్ని సంవత్సరాల తరువాత కూడా సామాన్య జీవితం గడుపుతారు. కొంతమంది HIV తో జీవిస్తున్నారు ఎయిడ్స్ దశలో ఉండి ARV మందులు వాడకుండా కూడా ఆరోగ్యంగా ఉన్నారు. HIV ని తొలిదశలో గుర్తించగలిగితే మన జీవితకాలాన్ని పొడిగించుకోవచ్చును.

ఎయిడ్స్ కు నివారణ ఉందా ??


ఎయిడ్స్కు నివారణ లేదు, వైరస్ వృద్ధి చెందకుండా మరియు వ్యాధి నిరోధక వ్యవస్థ దెబ్బతినకుండా HIV సమూలంగా శరీరం నుంచి తొలిగించలేవు. వేరే మందులు ఇతర అవకాశవాద వ్యాధులను నయం చేయగలవు / నియంత్రించగలవు. చాలా సందర్భాలలో ఈ మందులు సమర్ధవంతంగా పనిచేస్తాయి. కొత్తగా వచ్చిన ARV మందుల మిశ్రమం శరీరంలో ఉన్న CD4 కణాలను అభివృద్ధి పరచటంలో తోడ్పడుతుంది. కానీ కొన్ని అవకాశ వాద వ్యాధులని నయం చేయటం చాలా కష్టం.

No comments