Header Ads

హోటల్ సిబ్బందికి 16 లక్షలు టిప్పు ఇచ్చిన రోనాల్డో , కారణం ఏంటో తెలుసా

ఫైవ్‌ స్టార్‌ హోటల్లో సిబ్బంది సేవలకు మెచ్చి ఎవరైనా ఎంత టిప్పు ఇస్తారు ? మహా అయితే రూ. వెయ్యి లేదా రెండు వేలు. కానీ ఫుట్‌బాల్ సూపర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో ఎంత ఇచ్చాడో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏకంగా రూ. 16 లక్షలు టిప్పుగా ఇచ్చేసరికి ఆ రిసార్ట్‌ సిబ్బందికి నోట మాట రాలేదు

ఈ పోర్చుగీస్ స్టార్ ఆటగాడు కి ఈ హోటల్ సిబ్బంది అందించిన సేవలు బాగా నచ్చాయి అట . ఈ హోటల్ నుంచి ఆయన డైరెక్ట్ గా తాను ఆడబోతున్న కొత్త క్లబ్ జువెంట్స్ కి బయదేరాడు. రోనాల్డో తన పాత క్లబ్ రియల్ మాడ్రిడ్ ని వదిలి జువెంట్స్ కి వెళ్ళాడు.




ఈ సారి ప్రపంచ కప్ లో బాగా ఆడినా తన జట్టు ఫైనల్ కి కూడా చేరలేదు .వరల్డ్‌ కప్‌లో పోర్చుగల్‌ రౌండ్‌-16లోనే ఓడిపోవడంతో, రోనాల్డో కి కొంచం విశ్రాంతి దొరికినట్టు అయ్యింది . ఆయన సేద తీరేందుకు గ్రీక్ లగ్జరీ హోటల్ కి తన కుటుంబం మరియు మిత్రులతో వెళ్ళాడు . ఈ హోటల్ లోనే తన కొత్తగా వెళ్లబోయే క్లబ్ వాళ్ళతో ఫుట్‌బాల్ సూపర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో డీల్ కుదుర్చుకున్నాడు .ఇటాలియన్‌ చాంపియన్‌ యువెంట్‌సతో ఇటీవలే నాలుగేళ్లకు ఒప్పందం కుదుర్చుకున్న క్రిస్టియానోను ఆ క్లబ్‌ చైర్మన్‌ ఆండ్రియాస్‌ ఆగ్నెల్లి ఈ రిసార్ట్‌లోనే కలుసుకున్నాడు. తాను ఈ హోటల్ లో గడుపుతున్నట్టు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో కూడా పోస్ట్ చేసాడు రోనాల్డో .

చివరి రోజు హోటల్ కాలి చేసే సమయానికి ఆయన హోటల్ బిల్ కాకుండా ఇంకో 16 లక్షలు టిప్ గా హోటల్ సిబ్బందికి ఇచ్చాడు. ఆ డబ్బు మొత్తాన్ని హోటల్ లో పని చేసే వారి అందరికి సమానంగా పంచమని కోరాడు రోనాల్డో. కొసమెరుపు ఏంటి అంటే రోనాల్డో ప్రతి నెల సంపాదించే దానిలో ఈ 16 లక్షల టిప్పు కేవలం తనకు 1% మాత్రమే . ఎంతైనా రోనాల్డో మంచి హృదయానికి హ్యాట్స్ ఆఫ్

No comments