Header Ads

16-07-2018 సోమవారం రాశి ఫలాలు

ఈ రోజు మార్చ్ 16, 2018 సంవత్సరం (07-16-18) రాశి ఫలాలు ఇలా ఉన్నాయి

మేషం రాశి :
మీ ఆగ్రహావేశాల వల్ల ముఖ్యమైన కార్యం విఫలమయ్యే ఆస్కారం ఉంది . గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. వీసా, పాస్ పోర్టు వ్యవహారాలు సానుకూలమవుతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. సంఘంలో గౌరవం లభిస్తుంది.మిమ్మల్ని అవహేళన చేసిన వారు మీ సహాయం అర్థిస్తారు.

వృషభం రాశి :
మిత్రులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు నుంచి బయటపడతారు. ఉద్యోగులకు స్థాన చలనం తప్పదు. భూముల క్రయవిక్రయాలలో లబ్ది పొందుతారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వడ్డీ వ్యాపారస్తులకు సంతృప్తి చేకూరుతుంది. క్రయ విక్రయ రంగాల వారికి కలిసివచ్చేకాలం.
మిథునం రాశి :
ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయమవుతారు. మీ అభిరుచి ఆశయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలు వాదనలు, పంతాలకు పోవటం వల్ల కొన్ని వ్యవహారాలు స్తంభించిపోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. రుణాల తీరుపోతాయి . చర్చల్లో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు వస్తాయి.ఆర్థిక ఇబ్బంది అంటూ లేకపోయినా సంతృప్తి కానరాదు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి.

కర్కాటకం రాశి :
నూతన వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మిత్రులతో మరియు కుటంబం లో విందువినోదాలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అనుకోని అతిథులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కొన్ని విషయాలలో మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. హోటల్, తినుబండారాలు, బేకరీ పనివారలకు సామాన్యం. రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు.

సింహ రాశి :
కుటంబ సమస్యలు తీరి ప్రశాంతగా ఉంటారు.స్త్రీల సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవలసివస్తుంది. విద్యార్ధులకు మిత్రబృందాలు, వ్యాపకాలు అధికం కాగలవు. కీలక నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకుంటారు. మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రేమికుల మధ్య అపోహలు తొలగిపోగలవు. తలపెట్టిన పనులలో ఒత్తిడి, జాప్యం వంటి చికాకులు ఎదుర్కొంటారు.

కన్య రాశి :
బంధువులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు, మీ పాత సమస్యలు పరిష్కారం కావటానికి కొంతకాలం వేచియుండక తప్పదు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. దీర్ఘకాలిక రుణాల నుంచి బయటపడతారు. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇప్పుడున్న పనిభారంతో పాటు అదనపు బాధ్యతలు చేపట్టవలసి వస్తుంది. అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది.

తుల రాశి :
మీ కళత్ర వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో సానుకూలతలుంటాయి. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రైవేటు సంస్థలలో వారికి అనుకూలమైన కాలం. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. సంతానం నూతన విద్యావకాశాలు పొందుతారు. ఆత్మీయులకు మీ సమస్యలు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఉంది. కొన్ని పాత వ్యవహారాలు చక్కబడతాయి.

వృశ్చిక రాశి :
ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. రాజకీయ నాయకులకు విదేశీ పర్యటనలు అనుకూలం. నూనె, ఎండుమిర్చి, పసుపు, ధనియాలు, బెల్లం, శెనగలు వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనివారితో చికాకులు వంటివి ఎదుర్కొంటారు.ప్రముఖులను కలుసుకుంటారు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానయోగం ఉంది.

ధనస్సు రాశి :
వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి ఒత్తిడి తీరుతాయి. ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ప్రియతములు ఇచ్చే సలహా మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. హోటల్, తినుబండారాలు, బేకరీ పనివారలకు సామాన్యం. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకురాగలవు.

మకరం రాశి :
విలువైన వస్తువులు, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. విందువినోదాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కాంట్రాక్టర్లకు రావలసిన ధనం వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. తండ్రి నుంచి ఆస్తి లాభం పొందుతారు. నూతన దంపతులకు ఎడబాటు, చికాకులు తప్పవు. వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ లక్ష్యం నెరవేరుతుంది.

కుంభం రాశి :
వాహనం నడపటం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం పట్ల, వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలు లాభిస్తాయి. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.బంగారం, వెండి, వ్యాపారస్తులకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి.ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఆర్థిక సహాయం అర్థించుటవలన మీకు ఆందోళన తప్పదు.

మీనం రాశి :
పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం మంచిది. విద్యా వైజ్ఞానిక విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. కోర్టు, ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ముఖ్యమైన సంప్రదాయాలు పాటిస్తారు.వాహనాలు కొనుగోలు చేస్తారు. ధన, వస్తులాభాలు పొందుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది.

No comments