Header Ads

వందల కోట్ల అధిపతి , 150 రూపాయలు కోసం కక్కుర్తి పడ్డాడు , 800 కోట్లు నష్టపోయాడు

ఐటి నగరాల్లో మొదటిగా ఉండే బెంగళూరు నగరం లో జరిగిన సంఘటన ఇది . అవినాశ్ అమర్‌లాల్ కుఖ్రేజా అనే వ్యక్తి బాగా డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు . వీటిలో చాల మటుకు అక్రమంగా సంపాదించిన డబ్బులే . అయితే ఈ డబ్బు అంతా ఇంట్లో ఉంచితే ఏదో రోజు ఎవరైనా తెలిసిన వారే ఆదాయపు శాఖ అధికారులకి చెప్తారు అని సంపాదించింది అంతా పోతుంది అని ఒక పెద్ద స్కెచ్ వేసాడు.




పధకం ప్రకారం బెంగళూరు నగరం లో 150 ఏళ్ల చరిత్ర ఉన్న ది బౌరింగ్‌ క్లబ్‌లోని‌ బ్యాడ్మింటన్‌ కోర్స్ లో చేరాడు . అక్కడ చేరిన వారి అందరికి వాళ్ళ ఆట సామగ్రి , మరియు సేద తీరేందుకు ఒక లాకర్ సదుపాయం ఇస్తారు. ఎక్కువ సామాను ఉన్న వారికి ఎక్కువగా మూడు లాకర్లు మాత్రమే ఇస్తారు ఒక సభ్యత్వానికి. కాకపోతే వాటికి ఇంకోచం డబ్బులు ఎక్కువగా చెల్లించాలి . వీటికి నెలకు ఒక్కో లాకర్‌కు రూ.5 వసూలు చేసేవారు. తరచూ వెళ్ళకుండా ఎప్పుడో ఒక సారి డబ్బులు బాగా జమ అయ్యాక బ్యాడ్మింటన్‌ కోర్ట్ కి వెళ్ళేవాడు . వెళ్ళే అప్పుడు తన డబ్బుని అక్కడ ఉన్న లాకర్లు లో బద్రపరుస్తూ వచ్చాడు . ఎవరు ఎ రోజుకు పట్టుకోలేరు అనుకున్నాడు.

ఇక్కడ వరుకు అంతా బాగున్న , ఇటీవల ఆ లాకర్ల ధర నెలకు రూ.50కు పెంచారు. అయితే అవినాశ్ అమర్‌లాల్ కుఖ్రేజా కి మూడు లాకర్ల ఉన్నాయి. ఆయన ప్రతి నెల ఇంకో 150 రూపాయిలు అదనంగా చెల్లించాలి , ఆయన గత కొన్ని నెలలుగా లాకర్ల రుసుం చెల్లించడంలేదు. పలుమార్లు క్లబ్‌ సిబ్బంది ఆయన్ను డబ్బు అడిగినా స్పందించలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సిబ్బంది శుక్రవారం నాడు ఆ మూడు లాకర్ల వేరొకరికి కేటాయించేందుకు తాళాలను బద్దలుకొట్టారు. లాకర్లు తెరిచిన సిబ్బంది అందులోని డబ్బు, వజ్రాలు, బంగారం, ఆస్తి పత్రాలను చూసి బెంబేలెత్తిపోయారు. వెంటనే పోలీసులు , ఐటీ శాఖ అధికారులకు వాటిని అప్పగించారు. రూ.3.96 కోట్ల నగదు, రూ.8కోట్లు విలువైన వజ్రాలు, రూ.800 కోట్లు విలువైన ఆస్తిపత్రాలు, బ్లాంక్‌ చెక్కులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

విషయం తెలుసుకున్న అవినాశ్ అమర్‌లాల్ కుఖ్రేజా బౌరింగ్‌ క్లబ్‌లో పనిచేసేవారికి మొత్తం డబ్బు ఉంచుకోమని చెప్పాడు , కాని ఆ ఆస్తి పత్రాలు మాత్రం ఎవరికి ఇవ్వదని . ఈ విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడు. కాని అప్పటికే ఆదాయపు శాఖ కు సమాచరం అందింది. అవిషనాష్‌ వెళ్లే మరో క్లబ్‌కు ఐటీ సిబ్బంది వెళ్లారు. అక్కడ కూడా తనిఖీలు చేపట్టి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు.అవినాష్‌ ఒక వ్యాపారవేత్త. అతనికి రాజకీయ నాయకులతో పరిచయాలు ఎక్కువగా ఉండేవని తెలుస్తోంది. అతను బినామీ సొమ్ముతో రియల్‌ ఎస్టేట్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు తేల్చేసారు. అవినాష్‌ వెనుక రాజకీయ నాయకులు, బడా అధికారులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం అతనిపై మనీ లాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ సంఘటన్ తర్వాత బెంగళూరులోని మరికొన్ని క్లబ్‌లు కూడా తమ వద్ద ఎంతోకాలంగా తాళాలు వేసిఉన్న లాకర్లను తెరవాలని నిర్ణయించాయి.

No comments