Header Ads

కొత్త రూ.100 నోట్లు విడుదల చేసిన ఆర్బీఐ

వంద రూపాయల నోటు రంగు మార్చుకోబోతోంది. త్వరలోనే కొత్త రూ.100 నోట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ( ఆర్బీఐ) తెలిపింది. కొత్త రూ.100 నోటు వెనుక వైపున గుజరాత్ లోని పటాన్ పట్టణంలో ఉన్న 11వ శతాబ్దానికి చెందిన వారసత్వ కట్టడం 'రాణికి వావ్'ను ఉంచినట్లు పేర్కొంది. ముదురు నీలం రంగులో ఉండే ఈ నోట్లు త్వరలోనే విడుదల చేస్తామని. ఆ తర్వాతా కూడా పాత రూ.100 నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ చెప్పింది.




పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పటి వరకూ రూ.10 రూ.50, రూ.200, రూ. 500, రూ. 2000 కొత్త కరెన్సీ నోట్లను చలామణిలోకి తెచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,ఇంతకాలం వంద రూపాయల నోటును మాత్రం మార్చలేదు. దీంతో, ప్రస్తుతం ఉన్న నోట్లలో వంద నోటే పెద్దగా కనిపిస్తోంది. దీంతో, దీన్ని కూడా మార్చి కొత్త నోట్ల పోలికలో తేవాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. దీనికి తగ్గట్లుగానే కొత్త నోటు డిజైన్‌ను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఇంతవరకూ ఒక్కో నోటుకు ఒక్కో రంగును ఇస్తూ వచ్చిన ఆర్‌బీఐ, వంద రూపాయల నోటు ఊదారంగు (లావెండర్‌ను) ఎంచుకుంది.

ఈ కొత్త నోట్ పరిమాణం 66 mm × 142 mm ఉంటుంది . ఈ కొత్త నోట్ ప్రస్తుతం ఉన్న 10 రూపాయిల నోట్ కన్నా కొంచం పెద్దగా ఉంటుంది , అలాగే ఇప్పుడు చలామణి లో ఉన్న రూ.100 కన్నా ఇది చిన్నదిగా ఉంటుంది. కొత్త వంద నోట్లు పలు సెక్యూరిటీ ఫీచర్స్ తో తయారు అవుతున్నాయని, త్వరలోనే చలామణిలోకి వస్తాయంటున్నారు ఆర్‌బీఐ అధికారులు. కొత్తవి వచ్చినా పాత కరెన్సీ కూడా చెల్లుబాటులో ఉంటుందన్నారు.

No comments