ఇంటర్ విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి మధ్యాహ్న భోజనం పధకం అమలు:ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 1 నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 1,74,683 మంది విద్యార్థులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. ఈ పథకం అమలుకు ఇంటర్ విద్యా కమిషనర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.
ఈ మేరకు ఉత్తర్వులను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్దాస్ బుధవారం విడుదల చేశారు.
వివరాల్లోకి వెళితే ఈ పథకానికి రూ.56.53కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం 331 జూనియర్ కళాశాలలకు వాటికి అనుబంధంగా ఉన్న ఉన్నత పాఠశాలల నుంచి ఆహారం అందించడం జరుగుతుంది. మిగిలిన 119 కళాశాలలకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశా లల నుంచి అందిస్తారు. ఈ బాధ్యతలను కూడా కేంద్రీయ వంట శాలలు, ఎన్జీవోలకు ప్రభుత్వం అప్పగించనుంది.
ఆహారం వండేందు కు రూ.23.75కోట్లు, కోడిగుడ్ల సరఫరా కోసం రూ.13.08కోట్లు, వంట వారికి, హెల్పర్లకు పది నెలలకు కలిపి రూ.1.90కోట్లు, రవాణ ఖర్చుల కింద రూ.17.80కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఈ పథకం అమలు చేసేందుకు రూ.56.53 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. మెనూలో భాగంగా ప్రతి విద్యార్థికీ రోజుకు కనీసం 966 కేలరీలు, 27.85 గ్రాముల ప్రొటీన్ల ఆహారాన్ని అందిస్తారు.
నాణ్యమైన బియ్యంతో వండిన భోజనాన్ని సీల్ వేసిన/స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్స్ ద్వారా సరఫరా చేస్తారు. విద్యార్థులకు అవసరమైన గుడ్లను ప్రస్తుతం పాఠశాలలకు సరఫరా చేస్తున్న వాళ్లే కాలేజీలకూ సమకూరుస్తారు.

Post a Comment