Header Ads

మన మాట ఎలా ఉండాలి ?

నడివేసవిలో చిరుజల్లులు కురిస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ,విదురులవారి భాషణం అంత ఆహ్లాదకరంగా ఉంది మహారాజుకు .
.
ఏ పని సఫలంకావాలన్నా చక్కని మాట చాలా ముఖ్యం.
.
మాట అంటే భాషతెలవడం ఒకటే కాదు!
.
భాష+భావం కలిస్తెనే మాట అవుతుంది!

మన మాట ఎలా ఉండాలి ?
మన మాట ఎలా ఉండాలి ?

.


కొందరు మాట్లాడితే కొట్టినట్లుంటుంది,
మరికొందరు మాట్లాడితే మనసునెక్కడో తట్టినట్లుంటుంది!.
కొందరి మాట పిడుగు పడ్డట్లుంటుంది ,
కొందరి మాట వీణానాదం వినిపించి నట్లుంటుంది.
కొందరి మాటలు మనసులో తూటాలు పేలుస్తాయి,
మరికొందరి మాటలు మనసులో సరిగమలు పలికిస్తాయి.
కొందరి పలుకులు తేనెలొలికిస్తాయి,
కొందరి పలుకులు ములుకులు దించుతాయి.
.
మాటను ఎవడయితే తన స్వాధీనంలో ఉంచుకోగలుగుతాడో వాడికి ఈ ప్రపంచంలో సాధ్యంకానిదేదీ లేదు.
.
ఎదిరికి హితముమను బ్రియమును మదికింపును గాగ బలుకు మాటలు పెక్కై
యొదవిననులెస్స ,యటుగాకిది యది యన కూరకునికి ఎంతయు నొప్పున్.
.
ఎదుటివాడికి మేలయినవి ఇష్టమైనవి వాడి మనస్సుకు సంతోషకరమైనవి అయిన మాటలు ఎంత మాట్లాడితే అంత మంచిది! లేక పోతే ఊరకే ఉండటం మంచిది.
.
ప్రతివాడికి తన గురించి ,తన కుటుంబం గురించి ఒక గొప్పభావన ఉంటుంది! అదే వాడి బలం,బలహీనత.
మనం ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి ,లేదా ఎవరికయినా ఫోను చేశామనుకోండి ఏం మాట్లాడాలి! ఇది అందరినీ వేధించే ప్రశ్నే .
.
ఎదుటి వాడి యోగ క్షేమాలు వారి పిల్లలగొప్పతనం,వారువేసుకొన్న బట్టలనాణ్యత,వారు ఇల్లు ఉంచుకున్నవిధం ,అందంగా ఉంటేనే!
ఆ ఇంట్లో ఏదయినా ప్రత్యేకత ఉంటే దానిని పొగడటమో చేయాలి! .
.
వారి ఇంటి కెళ్ళి మన గురించి గొప్పలు మన పిల్లలగొప్పలు చెప్పుకోకూడదు .
.
అలానే ఒక ఉత్తరం గానీ ఒక mail గానీ పంపేటప్పుడు ఎదుటివాడి ప్రస్తావనే ఎక్కువ ఉండాలిగానీ మనగురించినవి సాధ్యమైనంత తక్కువ ఉండాలి.
.
ఎందుకు ?
ఎవడికి వాడే బాగా ప్రియమయినవాడు!
"నా" కంటే నాకు ప్రియమయినది ఏదీ లేదు! మనమంతా కలిసి దిగిన గ్రూపు photo లో మనము మొదట చూసేది మన photo నే !
.
దీనిని YOU ATTITUDE అని అంటారు ఇది ఎంత అలవాటు చేసుకుంటే అంత రాణిస్తారు
.
స్నేహాలు,శత్రుత్వాలు,జ్ఞానాజ్ఞానాలు,ధర్మము ,అధర్మము ,
ఆధిక్యం,నైచ్యం ,పెద్ద చిన్న ఇవ్వన్నీ కూడా మాట తీరును బట్టే వస్తాయి.
.
కాబట్టి ఒప్పుగా మాట్లాడటానికి మనిషి నిరంతరం ప్రయత్నించాలి. అది సాధ్యం కాకపోతే మౌనం పాటించాలి!
.
మౌనమూపాటించక ,
మాట్లాడటమూరాక అడ్డదిడ్డంగా మాట్లాడితే ..?
.
గొడ్డలితో మొదలంటానరికినాచెట్లుచిగురిస్తాయికానీ ,
మాటలతో భగ్నమయిన కార్యం ఆతరువాత ఏ విధంగానూ చక్కబడదు!
.
(ఈ రోజు పెళ్ళిళ్ళు ఎవరి వ్యక్తిత్వం వారికి బాగా వికసించిన తరువాత అవుతున్నాయి .
మొదట్లో రెండు వ్యక్తిత్వాల మధ్య ఘర్షణ అనివార్యం !
ఒకరి పనులు మరొకరికి నచ్చక పోవచ్చు అలాంటి సందర్భాలలో ఒకరినొకరు అనవసరంగా మాటలు అనుకొవడం తగ్గించుకోవాలి ,మౌనం పాటించాలి!
.
కాలం గడుస్తున్నకొద్దీ ఇరు వ్యక్తిత్వాల మధ్య దూరం తగ్గి అవిరెండు విడదీయరానంతగా పెనవేసుకుపోయి ,
ఒకదానిలో ఒకటికలిసిపోయి ఒకే కుటంబ వ్యక్తిత్వంగా రూపాంతరం చెందేవరకూ ఓపిక పట్టాలి .
.
అప్పటినుండీ మొదలవుతుంది జీవనమాధుర్యం ఏమిటో!.
అలాకాకుండా నిత్యం సంఘర్షణే అనుకోండి ,జీవితంలో కలిసిబ్రదికినప్పటికీ మాధుర్యం కోల్పోయినవారవుతారు!.
.
మాట తూటాలాగ పేలగలదు,మనిషి జీవితానికి రాచబాటా వేయగలదు!
.
ఒక అద్బుతమయిన పద్యం .
.
తనువున విరిగిన యలుగుల ననువున బుచ్చంగవచ్చు నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు వినుమెన్ని యుపాయములను వెడలునె యధిపా!.
.
మహారాజా విను! శరీరంలో నాటుకున్నబాణాలను ఉపాయంతో తీయవచ్చు అవిచేసిన గాయాలు మానిపోతవికూడా!
కానీ,మనస్సులో నాటుకున్న మాటలు ఏ ఉపాయాలతోటయినాగానీ వెలుపలికి వస్తాయా?
.
మాట ఒక పదునయిన ఆయుధం !
అదునులో కురిసే వర్షపుజల్

No comments