ప్రణయ్ హత్య తరహాలోనే వెలుగు లోకి వచ్చిన మరో పరువు హత్య ఘటన..!

ఇటీవల కాలం లో ప్రణయ్ హత్యా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు, ప్రణయ్ వ్యవహారం మరువక ముందే అలంటి ఇంకో ఘటన బాయట పడింది. కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో మిర్యాలగూడలో జరిగిన దళిత యువకుడు ప్రణయ్ హత్య కేసు తరహాలోనే మర్డర్ జరిగింది. ఆరు నెలల క్రితం జరిగిన ఈ హత్య కేసు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. కేరళలోని కొట్టాయంకు చెందిన నీనూ(21), జోసెఫ్(23) అనే ఇద్దరూ ప్రేమించుకున్నారు. జోసెఫ్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా వారు ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి నీనూ జోసెఫ్‌లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన యువతి కుటుంబం జోసెఫ్‌ను కిడ్నాప్ చేయించి, హత్య చేయించి అతని శవం చాలియెక్కర కెనాల్‌లో పడేసింది. రిజిస్టర్ మ్యారేజ్ జరిగిన 2 రోజులకే ఈ హత్య జరిగింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి.. ప్రమాదవశాత్తు కాలువలోపడి మరణించినట్టుగా పేర్కొని కేసు మూసేశారు. కానీ, మృతుని కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది. దీన్ని పరువు హత్యగా నిర్ధారించిన కొట్టాయం అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు… ఆరు నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.

కొన్ని చోట్ల అయితే అమ్మాయి ని కూడా చంపేస్తారు, కన్నా కూతురు అనే కనికరం కూడా లేకుండా మృగాళ్ల మారిపోతారు, వాళ్ళని సరైన మార్గం లో నడిపియడం వరికే తల్లి తండ్రుల బాధ్యత . పిల్లలు తమకు నాచని పని చేస్తే ఏ తల్లి తండ్రులకైనా కోపం వస్తుంది, కానీ ఆ కోపం తో పిల్లోలా ప్రాణాలను బాలి తీయకండి, వాళ్ళు చేసిన తప్పు వాళ్లకు తెలిసి వచ్చిన వేళ మీ విలువ వాళ్ళకి తెలిసి వస్తుంది. పిల్లోళ్లకి కష్టం వస్తే ప్రాణం అడ్డేసి అయినా ఆ కష్టాన్ని తొలగించడానికి ప్రయత్నించాలి, అంతే కానీ ఆ కష్టమే తల్లి తండ్రుల రూపం లో వస్తే వాళ్ళ ప్రాణాలు ఈ భూమి మీద ఉన్న ఒకటే లేకున్నా ఒకటే, చిన్నప్పుడు చాకోలెట్స్ అంటే ఇష్టం, బొమ్మలు చూడటం అంటే ఇష్టం, అలాగే పెరిగే కొద్దీ ఇష్టాలు అనేవి మారుతూ ఉంటా, అందుకే తల్లి తండ్రులు ప్రేమ విషయం లో భయపడేది, అందరు హత్యలు చేసే వాళ్ళు ఉండరు, రేపొద్దున్న నా కూతురు ఎంత సంతోషంగా ఉండగలదు అనే ఆలోచిస్తాడు ఏ తండ్రి అయినా..పరువు హత్యలు ఇకపైన అయినా జరుగ కుండా ఉండాలని కోరుకుందాం.

Leave a Reply