కేసీఆర్ సోదరి లీలమ్మ ప్రైవేటు హాస్పిటల్ లో కన్నుమూత

తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( కేసీఆర్) గారి సోదరి లీలమ్మ గారు కన్నుమూశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసంలో విషాదం నెలకొంది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు అని కుటుంబ సభ్యులు తెలిపారు.

leelamma

గత 3 రోజులుగా తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి మరణవార్త విని హుటాహుటిన  ఆయన హైదరాబాద్‌కు పయనమయ్యారు. మధ్యాహ్నం దిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. లీలమ్మ మృతిచెందినట్లు తెలుసుకున్న కేసీఆర్‌ బంధువులు, సన్నిహితులు ఆయన నివాసానికి తరలి వస్తున్నారు. లీలమ్మ మృతి వార్త తెలుసుకున్న హరీష్‌ రావు, కేటీఆర్‌లు యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు.

కేసీఆర్‌కు ఈమె నాలుగో సోదరి.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన శంకర్ రావును ఆమె వివాహం చేసుకున్నారు. వారికి కాంతారావు, మధుసూదన్ అనే కుమారులు ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసీఆర్ రెండో అక్క విమలాబాయి కన్నుమూశారు. కేసీఆర్‌కు మొత్తం 10 మంది తోబుట్టువులు. వీరిలో 8 మంది అక్కలు, ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు. ప్రతి సంవత్సరం ఆమె రక్షా బంధన్ పండుగ రోజు కేసీఆర్ కి ఆమె రాఖి కడుతారు .

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడ్నుంచి హైదరాబాద్‌కు బయల్దేరనున్నారు. మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పర్యటనను రద్దు చేసుకున్నారు. యశోదా ఆస్పత్రిలో కేటీఆర్, హరీశ్ రావు, సీఎం కేసీఆర్ సతీమణి శోబ.. లీలమ్మ పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆస్పత్రి నుంచి లీలమ్మ భౌతికకాయాన్ని ఆమె నివాసానికి తరలించారు.

LEELAMMA

ఇప్పటికే ఢిల్లీ లో ప్రధానమంత్రి ని కలిసిన కేసీఆర్ రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై సీఎం ప్రధానితో చర్చించారు.  తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపాల్సిందిగా ప్రధానిని కోరారు. కొత్త జోనల్ వ్యవస్థ అవసరాన్ని ప్రధానికి వివ‌రించారు . హైకోర్టు విభజన అంశంపై కూడా చర్చించారు. హైకోర్టును సత్వరం విభజించాల్సిందిగా ప్రధానిని కేసీఆర్ కోరారు.

వీటితో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ నిధులు సమకూర్చడం.. సెక్రేటేరియట్ నిర్మాణానికి రక్షణ శాఖ స్థలం కేటాయించడం.. రిజర్వేషన్ల పెంపు కోసం రాజ్యంగ సవరణ చేయడం.. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల విడుదల.. కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు. కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు తదితర అంశాలపై ప్రధానితో చర్చించారు. మిగిలిన కేంద్ర ప్రభుత్వ మంత్రులతో మాట్లాడే సమయం లో ఈ మరణ వార్త తెలుసుకున్న ఆయన హుటాహుటిన హైదరాబాద్‌కు పయనమయ్యారు.

ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం

Leave a Reply