భార్యకు కేన్సర్… ఆమె కోసం భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు.?

కేరళలో ఒక యువ జంట ప్రేమ కథ ఇప్పుడు అందరికి స్ఫూర్తినిస్తోంది. ప్రేమ అంటే నాలుగు మాటలు మూడు కవిత్వాలు రెండు పాటలు ఒక రాత్రి అంటూ అపహాస్యం చేసే వాళ్ళకి కేరళలోని ఒక ప్రేమ జంట నిజ జీవిత కథ, ప్రేమ విలువను తెలియజేసింది.

కేరళలోని త్రిసూరుకు చెందిన షాన్ ఇబ్రహిం బాద్షా, శ్రుతి కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగిన కొన్ని రోజులకే శ్రుతి అనారోగ్యం బారిన పడటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. శ్రుతికి కాన్సర్ ఉందని డాక్టర్ లు నిర్దారించారు, ఇరు కుటుంబాలు చాలా బాధ పడ్డారు, కానీ ట్రీట్మెంట్ చేస్తే శ్రుతికి నయం అవుతుందని డాక్టర్లు తెలుపడం తో షాన్ ఆనంద పడ్డాడు, శృతి ఆరోగ్యం మెరుగయ్యే వరకు తన వెంటే ఉన్నాడు. శ్రుతికి క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ మొదలుపెట్టారు. ఆ చికిత్స ప్రభావంతో శ్రుతి జుట్టు ఊడిపోయింది. తన భార్య ఆ స్థితిలో ఉన్నప్పుడు తనకు మాత్రం జుట్టు ఎందుకనుకున్నాడు. అతను కూడా గుండు చేయించుకున్నాడు.

ప్రస్తుతం శృతి కాన్సర్ ను జయించి ఆరోగ్యంగా ఉంది, వీరి పెళ్లి అయి సంవత్సరం కావడం తో షాన్ సోషల్ మీడియా లో తన ప్రేమ కథ ను షేర్ చేసుకున్నాడు. తను నా కష్ట సుఖాల్లో తోడు గా నిలిచినప్పుడు, తను కాన్సర్ తో బాధ పడుతున్నప్పుడు, తనకి తోడుగా ఉండటం లో తప్పేముందని పేర్కొన్నాడు షాన్. షాన్-శృతి జంట ఎందరో ప్రేమికులకు ఆదర్శకం అవ్వాలి. ప్రయాణంలో ఎంతటి కష్టం ఎదురైనా ఒకరికొకరు తోడుగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రేమ పవిత్ర బంధంగా కలకాలం వర్ధిల్లుతుంది. చరిత్రలో నిలిచిపోతుంది. అలాంటి కొన్ని ప్రేమ జంటలే రోమియో-జూలియట్, లైలా-మజ్నూ.

Leave a Reply